రాష్ట్రీయం

ఇవి రోడ్లేనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ మంత్రి టి.తారకరామారావు సోమవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇదివరకే అధికారులకు సూచించిన వంద రోజుల ప్రణాళిక పనులు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. ఆదివారం రాత్రి అమెరికా నుంచి నగరానికి చేరుకున్న మంత్రి ఉన్నట్టుండి తనిఖీలు నిర్వహించటం, అందులో వంద రోజుల కార్యాచరణ కింద చేపట్టిన పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించటంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఉదయం పది గంటలకు జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం నుంచి మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలతో కలిసి బయల్దేరిన మంత్రి శ్రీనగర్‌కాలనీ, జూబ్లీహిల్స్ ప్రాంతాలను సందర్శించారు. రోడ్డు విస్తరణ, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆయన ప్రజాసమస్యలను అడిగి తెల్సుకున్నారు. ప్రజలకు పౌరసేవలందించటంలో, సకాలంలో అభివృద్ధి పనులు చేపట్టడం, రోడ్ల నిర్వాహణ వంటి అంశాల్లో అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఇష్టారాజ్యంగా రోడ్లపై తవ్వేసిన గుంతలను గమనించిన మంత్రి ఇవి రోడ్లేనా? అంటూ వ్యాఖ్యానించారు. భూగర్భ విద్యుత్ కేబుల్ కోసం ట్రాన్స్‌కో విభాగం పనులు చేపడుతోందని, నాలుగు నెలలుగా పనులు జరుగుతున్నాయని వివరించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు యత్నించగా, ఈ పని తాలూకు కాంట్రాక్టర్‌ను అత్యవసరంగా ఇక్కడకు పిలిపించాలని ఆదేశించారు. ఆ తర్వాత గాజులరామారం, షాపూర్ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అక్కడ రూ. 5 భోజనం పంపిణీ కేంద్రంలో భోజనం కొని తిని, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో పరిస్థితి తాను ఊహించిన విధంగా లేదని, ఇంకా మెరుగుపడాల్సిన అవసరముందన్నారు. రోడ్ల తవ్వకాల పనులను కాస్త ముందుగా పూర్తి చేసుకుంటే ప్రజలకు వానాకాలం కష్టాలను కాస్త తగ్గించినట్టయ్యేదని ఆయన వ్యాఖ్యానించారు. వందరోజుల యాక్షన్ ప్లాన్ కింద నిర్దేశించిన పనుల పురోగతి నివేదికను ఈ నెల 15న విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
ఇంటింటికీ ఇంటర్‌నెట్
ఇంటింటికీ మంచినీటిని అందించే మిషన్ భగీరథ పథకం కింద ఇప్పటి వరకు 3500 కిలో మీటర్ల మేరకు పైప్‌లైన్లు వేశారని, ఇకపై పైప్‌లైన్లతో పాటు ఫైబర్ డక్ట్‌ను వేస్తారని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సోమవారం తెలిపారు. ఇంటింటికీ ఇంటర్‌నెట్ కోసం ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ పథకం అమలుపై ఐటి మంత్రి కె తారక రామారావు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయని 3500 కిలో మీటర్ల వరకు పైప్‌లైన్లు వేసినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల పైప్‌లైన్లతో పాటు ఫైబర్ డక్ట్‌ను వేయనున్నారు. డక్ట్ కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తారు.
మొత్తం ప్రాజెక్టు పనులు వేగంగా నడుస్తున్నందున ఫైబర్ గ్రిడ్ పనులు సైతం ఇక వేగంగా నడుస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు పైప్‌లైన్లు వేయడం పూర్తయిన మెట్రో సెగ్మెంట్ ఏరియాలో ఏరియల్ కేబులింగ్ ద్వారా ఫైబర్ గ్రిడ్‌ను పూర్తి చేయనున్నట్టు కెటిఆర్ తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు భారత్ నెట్ ద్వారా కేంద్రం నుంచి రావలసిన నిధుల సహాయంపైన ఐటి శాఖ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖాధికారులతో మంగళవారం సమావేశం నిర్వహిస్తారు.

చిత్రం నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అనంతరం
షాపూర్‌లో రూ. 5 భోజనం చేస్తున్న తెలంగాణ మంత్రి కెటిఆర్