రాష్ట్రీయం

పండుగప్పతో పండగే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 13: రొయ్యల సంక్షోభంలో తెరపైకి వచ్చిన పండుగప్ప చేపల పెంపకం దేశవిదేశాల్లో ఎనలేని డిమాండుతో రైతులకు సిరులు కురిపిస్తోంది. చేపల్లో రారాజుగా పిలిచే పండుగప్ప పేరుచెబితేనే మాంసాహారులు లొట్టలేస్తుంటారు. ఎంత ధరకైనా కొనుగోలు చేయడానికి వెనుకాడరు. అయితే పెంపకానికి రైతులు ఆసక్తి చూపుతున్నా, సరిపడేంత సీడ్ లభ్యంకాక డిమాండుకు తగినంత ఉత్పత్తి జరగడంలేదు.
వివరాల్లోకి వెళితే... నీలి విప్లవానికి కొత్త కళ తీసుకొచ్చిన రొయ్యల పెంపకం వైరస్ కారణంగా నీరసించిన సమయంలో 2005లో పండుగప్ప పెంపకం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లోని సముద్ర తీర ప్రాంతంలో పెంపకం మొదలయ్యింది. స్థానిక మార్కెట్‌తోపాటు, ఇతర రాష్ట్రాల్లో సైతం ఈ వెరైటీ చేపకు విపరీతమైన డిమాండు ఉంది. విదేశాలకు సంబంధించి సింగపూర్ నుండి కూడా డిమాండు ఉంది. ప్రస్తుతం కిలో రూ.300 నుండి రూ.500 వరకు పలుకుతోంది. ఇదే వెరైటీ చేపను ఇండోనేషియా, చైనా, జపాన్, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో సైతం ఉత్పత్తిచేస్తున్నప్పటికీ, మన దేశంలో ఉత్పత్తిచేస్తున్న చేపలకు మాత్రమే డిమాండు అధికంగావుంది. అయితే ఇంత డిమాండు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న పండుగప్ప స్థానిక అవసరాలకు మాత్రమే సరిపోతోంది.
ఏడాదిలో పట్టుబడికి వచ్చే పండుగప్ప బతికున్న చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటుంది. చేపల సాగులో కలుపుమాదిరిగా పెరుగుతున్న చైనా గొరకను ఇప్పుడు వీటికి ఆహారంగా వేస్తున్నారు. 8 నెలల కాలంలో పండుగప్ప మంచి సైజులో తయారవుతాయి. ఏడాదికాలం ఎదురుచూస్తే ఒక్కొక్క చేప 5 కిలోలకు తగ్గకుండా పెరుగుతోంది. అయితే దేశీయ మార్కెట్‌లో పండుగప్పకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కేవలం 2 నుంచి 3 కిలోల లోపుపెరిగిన వెంటనే పట్టి, మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక్కో ఎకరానికి లక్షల్లో లాభం వస్తుండటంతో రైతులు పెంపకానికి ఆసక్తిచూపుతున్నారు. అయితే పెంపకానికి అవసరమైన సీడ్ మాత్రం స్థానికంగా లభ్యం కావడంలేదు. ప్రస్తుతం రైతులు సీడ్ కోసం చెన్నైలోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ ఇన్‌స్టిట్యూట్‌పై ఆధారపడుతున్నారు. ఇంత డిమాండు ఉన్నా రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా హేచరీలు నెలకొల్పకపోవడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెంపకంలో అతి ముఖ్యమైన సీడ్‌లో దూరాభారం, ధర ఎక్కువగా ఉండటం వల్ల ఈ పెంపకాన్ని చేపట్టేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. 100 గ్రాముల పండుగప్ప సీడ్ రూ.25 నుండి రూ.30 వరకు ఉంటుంది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం దండిగా లభిస్తుండటంతో కొంతమంది రైతాంగం మాత్రం పెంపకం చేస్తున్నారు.
ఎగుమతి అవకాశాలు మెండుగా ఉండటంతోపాటు లాభదాయకమైన పండుగప్ప సాగు అభివృద్ధికి ప్రభుత్వం చొరవచూపాలని రైతులు కోరుతున్నారు. కేవలం ఉప్పునీటిలో మాత్రమే పెరిగే ఈ పండుగప్ప చేపను మంచినీటిలో సైతం సాగుచేసే విధంగా పరిశోధనలు సాగిస్తే మరింత మంచిదని రైతులు సూచిస్తున్నారు. స్థానికంగా కాలువలు, డ్రెయిన్లలో సైతం మత్స్యకారుల వలలకు పండుగప్పలు లభిస్తుంటాయి. అందువల్ల పండుగప్ప మంచినీటిలో సైతం పెరుగుతుందనేది రైతుల వాదన.

చిత్రం భారీ సైజులో పెరిగిన పండుగప్ప ,
చేపను చూపుతున్న రైతు