రాష్ట్రీయం

శ్రామిక శక్తికి నమస్సులు.. సాంకేతికతకు జేజేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13:అమరావతిలో అన్నీ రికార్డులే నెలకొంటున్నాయి. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాల భూములనివ్వడం ఓ రికార్డయితే, 60 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణం గల సచివాలయ భవనాన్ని 150నుంచి 200 రోజుల్లో నిర్మాణం కానుంది. ఇది మరో రికార్డు. వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయం భవనాన్ని చూసిన వారెవరికైనా అక్కడ చీమల దండులా శ్రమిస్తున్న కార్మికులను చూసి ముక్కున వేలేసుకోవలసిందే. వందలు కాదు.. వేల సంఖ్యలో కూలీలు రేయింబవళ్లు ఎండనక, వాననక శ్రమిస్తూ.. రాయి..రాయి భుజానకెత్తుకుని అద్భుత భారీ భవనాలను అలవోకగా నిర్మించేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కూలీలు గడువులోగా సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు అహరహం కష్టపడుతున్నారు.
రాజధాని ప్రాంతం వెలగపూడిలో గత 150 రోజులుగా జరుగుతున్న తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణాన్ని చూస్తే ఓవైపు కార్మికుల శ్రమశక్తికి, మరోవైపు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానానికి మోకరిల్లాలనిపిస్తుంది. 60 లక్షల ఎస్‌ఎఫ్‌టి భవనాన్ని 150 నుంచి 200 రోజుల్లో నిర్మించటమంటే మాటలు కాదు. షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టి నిర్మాణ సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ కేంద్రీకృతం చేశాయి. కొద్దిరోజుల్లోనే వందల అడుగులు తవ్వి, పిల్లర్లు నిర్మించారు. వెనువెంటనే శ్లాబ్‌లు వేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం జూన్ 27 నాటికి ఉద్యోగులంతా సెక్రటేరియట్‌కు వచ్చి పనిచేస్తారని ప్రకటించింది. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను గమనించి వారంతా డెడ్‌లైన్ నాటికి నిర్మాణం పూర్తికాదని పెదవి విరిచారు. కానీ ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి అందరినీ కార్యోన్ముఖుల్ని చేశారు. వందల సంఖ్యలో ఉన్న కూలీల సంఖ్యను వేలకు పెంచారు. పనులు వేగం పుంజుకున్నాయి. గడచిన 15రోజుల వ్యవధిలో అనూహ్యమైన ప్రగతి కనిపించింది. అంతర్గత రహదారులు లేకపోతే ఉద్యోగులు ఎలా వెళతారు? అనే ప్రశ్న ఉదయించిన వారం రోజుల్లోనే రోడ్లు వేసేశారు. 20వ తేదీ నాటికి దిట్టమైన రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని మంత్రి నారాయణ సోమవారం ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.
కొత్త సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం పనులు తుదిదశకు చేరుకున్నాయి. సోమవారం రాత్రికి ఒకటో భవనంలోని కింది అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయ పార్టిషియన్ పనులు పూర్తవుతాయని నారాయణ వివరించారు. మంగళవారం నుంచి ఏసి, ప్లంబింగ్, ఫ్లోరింగ్, ఇంటీరియర్ పనులు ప్రారంభవౌతాయి. 20 నుంచి పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధమవుతుందన్నారు. అలాగే రెండో భవనంలోని కింది అంతస్తు కూడా 25వ తేదీ నాటికి సిద్ధమవుతుందన్నారు. మూడో భవనంలోని కింది అంతస్తులో క్యాంటిన్, డైనింగ్ హాలు ఉంటుంది. ఐదో భవనంలోని గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ కూడా 27 నాటికి సిద్ధమవుతాయని, నాలుగో భవనంలో పనులు పూర్తికావడానికి కొంత సమయం పడుతుందని మంత్రి నారాయణ చెప్పారు.
భారీ నీళ్ల ట్యాంక్
సెక్రటేరియట్ ముఖద్వారం వద్ద భారీ నీళ్ల ట్యాంకును నిర్మిస్తున్నారు. ఇప్పటికే సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుళ్లూరు నుంచి సెక్రటేరియట్‌కు నీటిని తరలిస్తున్నారు. మరో రెండు, మూడురోజుల్లో ఈ నీరు సెక్రటేరియట్ పరిసరాలకు చేరుకోనుంది. ఇక్కడ ఆశ్ఛర్యకరమైన విషయం ఏమంటే.. ఈ భారీ వాటర్ ట్యాంకును కేవలం ఐదురోజుల్లోనే నిర్మించబోతున్నారు. ఇది కూడా ఓ రికార్డే అంటున్నారు.
అమెరికా టెక్నాలజీతో సీవరేజ్ ట్యాంక్
అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో మురుగు నీటిని శుద్ధిచేసే సీవరేజ్ ట్యాంక్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ముంబైలో తయారవుతోంది. ఇది మంగళవారం ముంబై నుంచి రవాణా అయి 17వ తేదీ నాటికి సెక్రటేరియట్‌కు చేరుకుంటుంది. కేవలం ఒక్కరోజులోనే దీన్ని అమర్చి సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్రటేరియట్ వద్ద డ్రైనేజ్ నిర్మాణ పనులు చేపట్టడం సాధ్యం కాని పరిస్థితి ఉంది. అందుకే టాయిలెట్లు, వాష్‌బేసిన్ల నుంచి పైపులైన్లను నేరుగా సీవరేజ్ ప్లాంట్‌కు అమర్చబోతున్నారు. ఇక ఉద్యోగులు వచ్చే సమయానికి కొన్ని బ్లాక్‌లలో టాయిలెట్ల నిర్మాణం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల అక్కడ బయో టాయిలెట్లు, రెడీమేడ్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

చిత్రంలు వెలగపూడిలో తుదిదశ నిర్మాణ పనుల్లో తాత్కాలిక సచివాలయం., ముఖ్యమంత్రి కార్యాలయంకోసం జరుగుతున్న సీలింగ్ పనులు