రాష్ట్రీయం

సెల్‌ఫోన్‌లోనే ఐఐటి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: సెల్‌ఫోన్‌లోనే ఐఐటి శిక్షణ పొందే అవకాశాన్ని ఒక యువకుడు హైదరాబాద్‌లో రూపొందించాడు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సబ్జెక్టు నిపుణులను, ఐఐటిపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐఐటిజెఇఇ ఫోరం పేరిట వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసిన ఈ యువకుడు ఉచితంగా ఐఐటి శిక్షణను సంవత్సరం పొడవునా పొందే వీలుకల్పించారు. ఆసక్తి ఉన్న వారు 9848083555 నెంబర్‌కు మెసేజ్ చేసి ఈ గ్రూప్‌లో ఉచితంగా చేరవచ్చు. ఐఐటి పరీక్షకు సంబంధించిన సిలబస్, పాఠ్యాంశాలు, క్లుప్తమైన నిర్వచనాలు, పరీక్షల్లో పదే పదే వచ్చే ప్రశ్నలు, గణితం, భౌతిక శాస్త్రం, గ్రూప్‌లో ఉన్న విద్యార్థులకు ఏ అనుమానం వచ్చినా, దానిని గ్రూప్‌లో సంధించిన వెంటనే ఆ అనుమానాలను అధ్యాపకులు, సబ్జెక్టు నిపుణులు నివృత్తి చేస్తున్నారు. దాంతోపాటు అంతకంటే తేలికైన పరిష్కారాలు ఉంటే వాటిని సహ విద్యార్థులు సైతం సంధించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద క్షితిజ సమాంతర వేదికగా దీనిని మలిచినట్టు గ్రూప్ రూపశిల్పి లలిత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ గ్రూప్‌ను ఎప్పటికపుడు వినూత్నంగా తీర్చిదిద్దుతామని, ఇంకా అధికంగా సమాచారం కోరుకునే వారికి ఐఐటిజెఇఇఫోరం డాట్ కామ్ ద్వారా నెట్‌వర్క్‌లో సమాచారాన్ని ఇస్తామని చెప్పారు. ఐఐటి శిక్షణకు లక్షలాది రూపాయలు చెల్లించి ఆందోళనకు గురవుతున్న విద్యార్థులకు ఇదో గొప్పవరమని, ఎలాంటి చెల్లింపులు లేకుండానే విద్యార్థులు ఉచితంగా నిరంతరం సమాచారాన్ని పొందే వీలుందని లలిత్‌కుమార్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. ఎల్‌కెజి నుండే ఐఐటి శిక్షణకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా తమకు సమయం ఉన్నపుడు, ఆసక్తి ఉన్నపుడు నేర్చుకునేందుకు వీలు కలుగుతుందని, మరీ క్లిష్టమైన అంశాలపై కూడా నిపుణుల నుండి సమాచారం పొంది దానిని విద్యార్థులకు షేర్ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.

కొడుకును అమ్మిన కన్నతండ్రి
రూ.1.30 లక్షలకు అమ్మకం
పోలీసు జోక్యంతో తల్లిఒడికి చేరిన చిన్నారి
నంద్యాల టౌన్, జూన్ 14: డబ్బు కోసం కన్న కొడుకునే అమ్మేశాడు ఓ తండ్రి. తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని సురక్షితంగా అమ్మఒడికి చేర్చారు. కర్నూలు జిల్లా నంద్యాలలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణం నూనెపల్లెకు చెందిన హుసేన్‌బీ, అబ్దుల్లా దంపతులకు నాలుగేళ్ల తరువాత సంతానం కలిగింది. తాగుడుకు బానిసైన అబ్దుల్లా భార్యను తరచూ వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తాగేందుకు భార్యను డబ్బు అడిగాడు. ఆమె తనవద్ద లేవనడంతో బయటకు వెళ్లాడు. డబ్బు కోసం 8 నెలల కొడుకు బాషాను పట్టణానికి చెందిన పండ్ల వ్యాపారి జబ్బార్‌కు రూ.1.30 లక్షలకు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం ఇంటికి చేరుకున్న అబ్దుల్లాకు కొడుకు ఒక్కడే కనిపించాడు. దీంతో బాలుడిని తీసుకుని ఇంటినుంచి బయటపడ్డాడు. నేరుగా జబ్బార్ వద్దకు చేరుకుని రూ.1.30 లక్షలకు అమ్మేశాడు. కొద్దిసేపటికి ఇంటికి చేరుకున్న హుసేన్‌బీ కొడుకు కనిపించకపోవడంతో భర్తపై అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పండ్ల వ్యాపారి జబ్బార్ వద్ద బాలుడు ఉన్నట్లు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను తల్లికి అప్పగించారు. అబ్దుల్లా పరారీలో ఉన్నాడు.
నరుూం అనుచరుడు షకీల్ మృతి
భువనగిరి, జూన్ 14: నల్లగొండ జిల్లా భువనగిరి మాజీ కౌన్సిలర్, రౌడీషీటర్, నాలుగు హత్య కేసుల్లో నిందితుడు షకీల్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆతని బంధువులు స్పష్టం చేశారు. రెండున్నర నెలల క్రితం రాష్ట్ర పోలీసులు పిడి యాక్టు మేరకు కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన షకీల్ మంగళవారం మృతి చెందిన సమాచారం భువనగిరి పట్టణంలో సంచలనం రేపింది. 1990 సంవత్సరంలో పట్టణంలోని టైర్ల వ్యాపారి ఎజాస్, 2010లో హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమ రాధాక్రిష్ణ, 2014లో నల్లగొండ జిల్లా కేంద్రంలో కోనపూరి రాములు, వలిగొండ విలేఖరి బాబర్‌ఖాన్‌ల హత్య కేసులో షకీల్ ప్రధాన నిందితుడు. ఇవేకాకుండా రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్లలో వివిధ కేసులలో అతనికి ప్రమేయమున్నట్లు సమాచారం. షకీల్ చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ ప్రారంభమైన నేరచరిత నరుూం ముఠాలో చేరి పెద ద నేరాలు, హత్యలకు పాల్పడ్డాడు. 2009 సంవత్సరంలో భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్‌గా 20వ వార్డునుండి గెలిచి మూడు నెలల అనంతరం తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసాడు. తిరిగి షకీల్ భార్య జైనబున్నీసా కౌన్సిలర్‌గా గెలిచి ప్రస్తుత మున్సిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా కొనసాగుతోంది. టిఆర్‌ఎస్ నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి జలీల్‌పూరలోని షకీల్ ఇంటి వద్ద ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు