ఆంధ్రప్రదేశ్‌

కొవ్వాడలో సామాజిక, ఆర్థిక సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 15: కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి కావల్సిన ఐదు వేల ఎకరాల భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ సభ ఆగస్టు 2న నిర్వహించేలా సంబంధిత అధికారులు ప్రణాళిక రూపకల్పన చేసారు. ఇందుకు రెండు విడతలుగా 218 బృందాలతో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించేందుకు ఈ నెల 20 నుంచి అధికారులు ‘అణు’వణువూ సాంకేతికపరంగానే టాబ్స్‌ద్వారా సర్వే నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. జూలై 31 నాటికి రెండు విడతలుగా ఈ సర్వే పూర్తి చేసి, ఆగస్టు 2న ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చాయి. కొవ్వాడ, రామచంద్రాపురం, కొవ్వాడ మత్స్యలేశం, కోటపాలేం, గూడేం, జీరుకొవ్వాడ, టెక్కలి గ్రామాల్లో ప్రతి ఇంటినీ సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలంటూ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పిసిఐఎల్) నిర్ణయించింది. ఆ మేరకు గత నెల 18న కొవ్వాడ భూముల సర్వే పూర్తి చేసినట్లు సంబంధిత అధికారులు ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. దీనికోసం అమెరికా కంపెనీలు 1.5 లక్షల కోట్లు కేటాయించాయి. భూ సర్వే నివేదికలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడంతో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించేందుకు హైదరాబాద్‌కు చెందిన పర్యావరణ పరిరక్షణ ట్రైనింగ్, రీసెర్స్ ఇనిస్టిట్యూట్ (ఈపిటిఆర్‌ఐ)కు అప్పగించింది. జూలై మాసాంతరానికి ఈ సర్వే పూర్తి చేసి కేంద్ర పర్యావరణ, అటవీశాఖల అనుమతుల కోసం మార్గం సుమగం అవుతోంది. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్టు అణుపార్కుకు సంబంధించిన ఒక సీనియర్ అధికారి వివరించారు.
ఎన్‌పిసిఐఎల్ సీనియర్ అధికారులు, కొవ్వాడ అణుపార్కు డైరక్టర్ జి.వి.రమేష్ బృందం ప్రస్తుతం ముంబయిలో ఈ కేంద్రం నిర్మాణ పనులపై అమెరికా న్యూక్లియర్ నిపుణులతోపాటు, తోషిబా కార్పొరేషన్ అధికారులతో రెండువారాలపాటు చర్చలు నిర్వహించనున్నారు. అణు విద్యత్ పార్కు ప్రతిపాదిత స్థలంలో ఏర్పాటు చేయనున్న ఆరు రియాక్టర్ల నుంచి 15 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎక్స్‌క్లూజివ్ జోన్ పరిధిలో గుర్తించారు. రామచంద్రారం, పెద్దకొవ్వాడ, చినకొవ్వాడ, టెక్కలి, గూడేం గ్రామాలు ఉన్నాయి. పూర్తిగా న్యూక్లియర్, పవర్ కార్పొరేషన్ నిపుణుల పర్యవేక్షణలో ఉండేలా ఇటీవల కొవ్వాడ ప్రాంతంలో సంబంధిత విజిలెన్స్ అధికారులు పరిశీలించి, నివేదికలు ఎన్‌పిసిఐఎల్‌కు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తర్వాత నిర్మాణ పనులు మరింత వేగవంతమయ్యాయి. ఆగస్టు మొదటి వారంలో ప్రజాభిప్రాయసేకరణ, భూసేకరణ పూర్తి చేసేందుకు అధికారులు పరుగులు తీస్తున్నారు. సామాజిక, ఆర్థిక సర్వే అనంతరం ప్రజాదర్భార్‌కు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సరికొత్త ప్యాకేజీ దేశంలో అత్యుత్తమైన ప్యాకేజీగా ఉంటోందన్న విషయాన్ని అక్కడ నిర్వాసితులతో సభలు, సమీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు కూడా జోరుగాసాగుతున్నాయి. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న సామాజిక, ఆర్థిక సర్వే ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తూ రెండు విడతలుగా జూలై ఆరో తేదీ నుంచి 31 వరకూ సాగుతోంది. ఈ సర్వేల అనంతరం భూసేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్యాకేజీల సభలు, సమీక్షలు పూర్తి చేసిన తర్వాత ప్రజాభిప్రాయసేకరణ ఆగస్టు మొదటివారంలో పూర్తికానున్నది.
అణు విద్యుత్ కేంద్రం నిర్మించనున్న శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలోని మత్స్యలేశం గ్రామం