రాష్ట్రీయం

భూ రికార్డులన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ఆంధ్రలో భూ రికార్డులన్నీ ఆన్‌లైన్ చేయాలని, వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. సర్ట్ఫికెట్లు సైతం ఆన్‌లైన్‌లో జారీచేస్తే పేదలు ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తారని అన్నారు. భూ రికార్డులను టెలిఫోన్, ఆధార్ నెంబర్లతో అనుసంధానించాలని, మీ ఇంటికి మీ భూమి రికార్డుల్లో లోపాలు సరిదిద్దాలని సూచించారు. ఈ-సేవలో మరో రెండు పోర్టల్స్ చేర్చినట్టు చంద్రబాబు వెల్లడించారు. ఈ-స్పందన, డిజిటల్ పంచాయతీ అనే రెండు వెబ్ పోర్టల్స్‌ను లాంఛనంగా సోమవారం ఆవిష్కరించారు. డిజిటల్ పంచాయతీ వెబ్ పోర్టల్‌లో వివాహ ధృవీకరణ పత్రం నుంచి ఆస్తి విలువ పత్రం, మ్యూటేషన్, మంచినీటి కుళాయి, కనెక్షన్లు, ఎన్‌ఓసిలు, భవన నిర్మాణాల అనుమతులు, లేఅవుట్ అనుమతులు, జనన మరణ నమోదు, ఇంటిపన్ను చెల్లింపు, వృత్తి లైసెన్స్, ఉపాధి హామీ పనులు, జాబ్ చార్టువంటి సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే అందించనున్నారు. అవినీతి నియంత్రించి, పరిపాలనను పారదర్శకంగా ఉంచడానికి డిజిటల్ సేవలు అందిస్తున్నట్టు సిఎం చెప్పారు. ఈ-స్పందన ద్వారా రాష్టస్థ్రాయి నుండి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఐటి సమస్యలు ఏర్పడితే పోర్టల్‌కు లాగిన్ అయి ఫిర్యాదు చేస్తే సమస్యలను 24 నుండి 48 గంటల్లో పరిష్కరిస్తారని చెప్పారు. ఐటి, ఐటిఇఎస్ సేవల ద్వారా దేశంలోనే ఆంధ్ర అగ్రస్థానంలో ఉందని సిఎం పేర్కొన్నారు.