రాష్ట్రీయం

ఇదేం పద్ధతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: సాగునీటి ప్రాజెక్టుల కోసం 123 జీవో కింద భూములు ఇవ్వాలని రైతులపై ఎందుకు వత్తిడి తెస్తారంటూ హైకోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపో తల పథకం కింద వట్టెం రిజర్వాయర్ పరిధిలోని తమ భూములు ఇవ్వాలని ప్రభుత్వం వత్తిడి తెస్తున్నదంటూ మహబూబ్‌నగర్ జిల్లా బిజ్నేపల్లి మండలం కరుకొండ గ్రామానికి చెందిన బి స్వామి రావు మరో 23 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి విచారించారు. తమ భూములను రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇవ్వాలంటూ ప్రభుత్వం వత్తిడి తెస్తోందన్న రైతుల అభ్యంతరాల్లో నిజం లేదని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అదే నిజమైతే ఖాళీ నోటరీ అఫిడవిట్లపై రైతుల సంతకాలను ప్రభుత్వం ఎందుకు సేకరిస్తున్నదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా రైతుల తరఫున న్యాయవాదులు రచన, ఎన్‌ఎస్ అర్జున్ కుమార్ ఖాళీ నోటరీ అఫిడవిట్లను హైకోర్టుకు సమర్పించారు. తమ ఆధీనంలోనే భూములు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని, జీవో ఎంఎస్ 123 కింద భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు రైతులు సిద్ధంగా లేరని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భూములను ఇవ్వాలని ప్రభుత్వం నిర్బంధించడం వల్లనే రైతులు కోర్టుకు వచ్చారని హైకోర్టు పేర్కొంది. భూముల కోసం రైతుల్ని వత్తిడి చేయవద్దని, రైతులు ఇప్పటికే తమ అభ్యర్ధనలను జిల్లా స్ధాయి భూసేకరణ కమిటీకి సమర్పించారని, రైతుల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు మహబూబ్‌నగర్ కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఈ పిటిషన్‌ను మూసివేసింది.