రాష్ట్రీయం

రెండేళ్లలో కర్నూలు నుంచి విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 16: కర్నూలు నగరానికి సమీపంలోని ఓర్వకల్లు వద్ద నిర్మించతలపెట్టిన విమానాశ్రయానికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు అధికార వర్గాల సమాచారం. రానున్న రెండేళ్లకాలంలో నిర్మాణం పనులు పూర్తిచేసి 2018 మే నెలలో విజయవాడకు తొలి విమానం నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు గ్రామం వద్ద విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం 1230 ఎకరాల భూమి మంజూరు చేసింది. ఈ భూమిని డిజిసిఎ అధికారులు, నిపుణులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి, భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని కోరినట్లు సమాచారం. ఈ పని పూర్తయిన వెంటనే టెండరు వ్యవహారం పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబరులో నిర్మాణం పనులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చిన్న విమానాశ్రయాలు, తక్కువ దూరం ప్రయాణించే విమాన ప్రయాణ రుసుముపై కేంద్రం ప్రకటించిన నూతన విధానంతో కర్నూలు నుంచి ఇతర పట్టణాలకు నడిపే విమానాల చార్జీలు తక్కువగా ఉంటాయని తద్వారా ప్రజలను ఆరకర్శించవచ్చని అధికారులు భావిస్తున్నారు. త్వరలో కేంద్ర విమానయానశాఖ అధికారులు కర్నూలు చేరుకుని భూమి స్వాధీనం చేసుకుంటారని వెల్లడవుతోంది.