రాష్ట్రీయం

మాక్ అసెంబ్లీలో ‘పవర్ పాయింట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రంలో సాగు-తాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై ప్రభుత్వం చెబుతున్నవి అబద్ధాలని భావిస్తున్న కాంగ్రెస్, వాటిని నిరూపించేందుకు పడుతున్న మీనమేషాలకు ఎట్టకేలకు తెరపడింది. అందులో భాగంగా మాక్ అసెంబ్లీ నిర్వహించి, అక్కడే ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఎట్టకేలకు కదలిక మొదలయింది. కేసీఆర్ అసెంబ్లీ వేదికపై నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌కు సమాధానంగా తామూ ప్రెజెంటేషన్ ఇస్తామని అప్పటినుంచీ పీసీసీ చెబుతూ వస్తోంది. అయితే, దానిని వాయిదాలు వేస్తూ వస్తోన్న టీ కాంగ్రెస్ అలసత్వంపై, దిగ్విజయ్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ఇంకా ఎంతకాలం పడుతుందని ప్రశ్నించి, చివరకు మీడియా సమక్షంలోనే నాయకులను నిలదీయడంతో ఈవారంతో చేస్తామని సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఆ ప్రకారంగా ఈవారంలో తేదీని ప్రకటించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రాణహిత- చేవెళ్లకు సంబంధించిన టనె్నళ్ల ఏర్పాట్లు 90 శాతం తమ ప్రభుత్వ హయాంలో జరిగితే కేసీఆర్ సర్కారు కేవలం 10 శాతం మాత్రమే చేస్తోందని టీ కాంగ్రెస్ నేతలు అప్పటినుంచీ వాదిస్తున్నారు. అదేవిధంగా మహారాష్టత్రో చేసుకున్న ఒప్పందాన్ని చర్చకు తీసుకువచ్చి, దానివల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలని భావిస్తోంది. తమ హయాంలో 150 మీటర్ల ఎత్తున రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించామని, కానీ కేసీఆర్ మహారాష్టత్రో 148 మీటర్లకే ఒప్పందం కుదుర్చుకుని తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసిందని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పనుంది. కాగా, కేసీఆర్ తన పవర్ పాయింట్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టుల గురించి చెప్పి, మళ్లీ అదే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న తీరునూ వివరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ అంశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసోజు శ్రవణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తుమ్మిడిహట్టి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై కేసీఆర్ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌కు సంబంధించిన వాస్తవ పరిస్థితులపై శ్రవణ్ బృందం అధ్యయనం చేస్తోంది. తుమ్మిడిహట్టికి సంబంధించి పీసీసీ మాజీ అధికార ప్రతినిధి శ్రీనివాసయాదవ్, ప్రాణహిత-చేవెళ్ల పోరాట సమితి నేతలు నయినాల గోవర్దన్, ప్రతాప్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లపై కసరత్తు చేస్తున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారీనీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే పెద్దయెత్తున డాక్యుమెంట్లు అందించారు.
మామూలుగా పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే దానివల్ల ప్రయోజనం లేదని, అదే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆహ్వానించి వారితో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే దాని ప్రభావం, ప్రచారం ఎక్కువగా ఉంటుందని పీసీసీ భావిస్తోంది. ఆ మేరకు మాక్ అసెంబ్లీ ప్రదేశం, తేదీ, స్పీకర్‌గా ఎవరు ఉండాలన్న దానిపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకుని, వచ్చే వారంలోగా మాక్ అసెంబ్లీ నిర్వహించాలని పీసీసీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రిటైరయిన పలువురు నిపుణులతో పాటు, ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉన్నతాధికారులతోనూ చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.