రాష్ట్రీయం

దొంగ బాబా దొరికాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: పూజల పేరిట లైఫ్‌స్టైల్ భవనం యజమానిని బురిడీ కొట్టించి, 1.30 కోట్ల నగదుతో ఉడాయించిన దొంగ బాబా ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుబడ్డాడు. బెంగళూరు శివార్లలోని ఓ ఇంట్లో తలదాచుకున్న బాబా శివను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల జాతీయ రహదారిపై పోలీసులు అదుపులోకి తీసుకున్న శివ కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దొంగ బాబాను పట్టుకోగలిగారు. బాబాశివను అరెస్టు చేసి నగలు, నగదు మూటను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బంజారాహిల్స్‌కు చెందిన లైఫ్ స్టైల్ భవన యజమాని బిల్డర్ మధుసూదన్‌రెడ్డి ఇంట్లో దొంగ బాబా శివ పూజలు చేసి, ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చి 1.30 కోట్ల రూపాయలు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే.
పాత నేరస్థుడు శివ చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లి గ్రామానికి చెందినవాడు. శివ అలియాస్ శివస్వామి కొంతకాలం కిందటే నకిలీ బాబాగా అవతారమెత్తాడు. రెండేళ్ల క్రితం అనంతపురం, తిరుపతిలోనూ ఈ బురిడీ బాబా పూజల పేరుతో హల్‌చల్ చేసి దాదాపు రూ. 63 లక్షలు కాజేసినట్టు పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దర్యాప్తులో వెల్లడైంది. లక్ష్మిదేవికి పూజలు చేస్తానని, దాంతో డబ్బు రెట్టింపవుతుందని బిల్డర్లను నమ్మించి మోసానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. శివ చేతిలో మోసపోయిన ఓ కుటుంబం తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కాగా కర్నాటకకు చెందిన మోహన్‌రెడ్డి అనే రియల్టర్ ఈ దొంగ బాబాను గత ఏడాదే మధుసూదన్‌రెడ్డికి పరిచయం చేశాడు. గతంలో ఈ బాబాతో మధుసూదన్‌రెడ్డి ఓ మారు పూజలు చేయించాడు. మొదటిసారి పూజలు చేసి, నమ్మకం పెంచుకున్న బాబా, ఈసారి డబ్బుతో ఉడాయించడం విశేషం. అయితే బాబాను హైదరాబాద్‌కు పంపించిన మోహన్‌రెడ్డి ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పిన్నట్టు సమాచారం. టాస్క్ఫోర్స్ పోలీసులు మోహన్‌రెడ్డి కోసం కర్నాటకకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపారు. త్వరలో దొంగ బాబా మోసాలను బయటపెడతామని, బాబా వెనుక ఎవరెవరున్నది..ఎంతమందిని మోసగించారనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా దొంగబాబా అరెస్టు, పూర్తి వివరాలను శుక్రవారం మీడియాకు చూపనున్నట్టు టాస్క్ఫోర్స్ డిసిపి లింబారెడ్డి తెలిపారు. బుధవారం మధుసూదన్‌రెడ్డి ఇంట్లో సాయంత్రం పూజలు నిర్వహించిన బాబా, మధుసూదన్ రెడ్డి కొడుకు సందేశ్‌రెడ్డితో కలిసి పూజలో పెట్టిన రూ. 1.30కోట్లను వెంట తీసుకెళ్లాడు. ఆ తరువాత స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో పూజలు చేసి, బంజారాహిల్స్‌లో బస చేసిన హోటల్‌కు వెళ్లారు. ఆ సమయంలో సందేశ్‌రెడ్డి కళ్లు తిరుగుతున్నాయని బాబాకు చెప్పడంతో, విశ్రాంతి తీసుకోవాలని చెప్పి, కారు తాళాలు తీసుకుని ఉడాయించాడు.. కాసేపటికి కోలుకున్న సందేశ్, ఇంటికి వెళ్లి చూడగా తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉండటం కనిపించింది. వెంటనే వాళ్లను ఆస్పత్రికి తరలించి, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలింది.

chitram నిందితుడు శివ