రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ బాధితుల మహాధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ముషీరాబాద్, జూన్ 16: అగ్రిగోల్డ్ బాధితులు గురువారం హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించారు. దేశంలోనే భారీ ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారాన్ని తక్షణం సిబిఐకి బదలాయించి సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏజెంట్లు, బాధితులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాకు రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, కాంగ్రెస్ నేత విహెచ్, లక్ష్మిపార్వతి మద్దతు పలికారు. గత కొన్ని రోజులుగా ఆందోళనలు, ధర్నాలతో నిరసన తెలిపిన అగ్రిగోల్డ్ సంస్థ బాధితులు, ఏజెంట్లు గురువారం హైదరాబాద్‌లో మహాధర్నాకు దిగారు. ఆలిండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలుత ఇందిరాపార్కు నుంచి గోశాలకు, గోశాల నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు అండాలు రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన సభకు జస్టిస్ బి.చంద్రకుమార్, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, నాయకులు పులి రాజారెడ్డి, వైఎస్సార్‌సిపి నేత లక్షీపార్వతి, బిఎంఎస్ జాతీయ కార్యదర్శి కెఎం సూర్యనారాయణ రావు, సిపిఎం నాయకులు వెంకట్, నర్సింహారెడ్డి, రాంనర్సింహారావు హాజరై సంఘీభావం ప్రకటించి ప్రసంగించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు, ఏజెంట్లకు న్యాయం చేకూర్చటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. విహెచ్ మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేకూర్చటానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోవాలని కోరారు. బినామీ ఆస్తులను జప్తు చేసుకుని విక్రయించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎనిమిది రాష్ట్రాలలో చోటు చేసుకున్న ఈ కుంభకోణం కేసులో సిఐడి ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. వెంటనే సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లక్షీపార్వతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి 200 కోట్లు ముడుపులు తీసుకుందని ఆరోపించారు.

చిత్రం మహాధర్నాలో మాట్లాడుతున్న లక్షీపార్వతి