రాష్ట్రీయం

పిఎస్‌ఎల్‌వి-సి 29 ప్రయోగం రేపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, నవంబర్ 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య రంగ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి 16న చేపట్టబోయే పిఎస్‌ఎల్‌వి-సి 29 రాకెట్ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 7గంటలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో శాస్తవ్రేత్తలు రాకెట్‌లోని నాలుగు, రెండు దశల్లో ఇంధానాన్ని నింపే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఇంధనం నింపి రాకెట్‌లోని అన్ని భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 16న సాయంత్రం 6గంటలకు పిఎస్‌ఎల్‌వి రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన 400కిలోల బరువుగల టెలియోస్-1, 123 కిలోల బరువుగల వెలాక్స్-1, 13 కిలోల బరువుగల వెలాక్స్-2, 78కిలోల బరువుగల కెన్ట్‌రిడ్జి-1, 3.5 కిలోల బరువుగల గలాసియా, 12కిలోల బరువుగల అతేనోక్సాట్-1 మొత్తం 629 కిలోల బరువుగల ఆరు ఉపగ్రహాలను 550 కి.మీ దూరంలోని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగం దృష్ట్యా ఇప్పటికే షార్‌కు ఇస్రో అన్ని సెంటర్ల డైరెక్టర్లు, శాస్తవ్రేత్తలు చేరుకోవడంతో సందడి నెలకొంది. మంగళవారం సింగపూర్‌కు చెందిన శాస్తవ్రేత్తలు విచ్చేయనున్నారు. ఇప్పటికే ఇస్రో వాణిజ్యపరంగా 20దేశాలకు చెందిన 51 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ ద్వారా పంపే 6 ఉపగ్రహాలను కలిపితే వాటి సంఖ్య 57కు చేరుతుంది. ప్రయోగం విజయవంతమైతే వాణిజ్య రంగంలో భారత్ మరో ముందడుగుకు వేసినట్టే. 59గంటల కౌంట్‌డౌన్ సజావుగా సాగినంతరం రాకెట్ 16న నింగిలోకి దూసుకెళ్లనుంది. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో శాస్తవ్రేత్తలు రాకెట్‌కు ఇంధనం నింపడంతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించినంతరం చివరిగా గ్లోబల్ పరీక్షలు చేసి ప్రయోగానికి 8గంటల ముందు విద్యుత్ సరఫరా ఇస్తారు. అనంతరం మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న సూపర్ కంప్యూటర్లకు అనుసంధానం చేసి అక్కడ నుండి రాకెట్ పనితీరు, ప్రయోగాన్ని పర్యవేక్షిస్తారు.

చిత్రం... రాకెట్‌లోని మూడో దశ