అంతర్జాతీయం

కఠిన చర్యలు కొరవడితే... ‘ఓర్లాండో’లకు అంతముండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 17: దేశంలో అత్యంత కఠినమైన రీతిలో తుపాకుల లైసెన్స్‌లకు సంబంధించిన చట్టాలను అమల చేయకపోతే ఓర్లాండో తరహా భయానక మారణకాండలు పునరావృతం అవుతూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ తరహాలో ఉగ్రవాద చర్యలకు విఘాతక కృత్యాలకు పాల్పడే ప్రతి ఒక్కరినీ గుర్తించడం, నియంత్రించడం, వారి ఆలోచనలను ముందుగానే పసిగట్టడం అనేది ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎవరు పక్కవాళ్లమీద దాడి చేస్తారో, స్నేహితులను కాల్చేస్తారో, సహ కార్మికులపై విరుచుకుపడతారో, పరిచయం లేనివారిపై దాడులు చేస్తారో ఊహించలేని విషయమేనని అన్నారు. అయితే, ఇలాంటి వాటిని అరికట్టడానికి కొంతలోకొంతైనా నియంత్రణ చర్యలు చేపడితే ఫలితం ఉంటుందని వెల్లడించారు. అయితే, దేశంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడం, మామూలు వ్యక్తి అయినా, టెర్రిరిస్టు అయినా, మతిస్థిమితం లేనివాడైనా వీటిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉండటం సరైనది కాదని అన్నారు.
కానీ, దురదృష్టవశాత్తూ అమెరికాలో జరుగుతున్న రాజకీయాలు ఈరకంగా ఆయుధాలు ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తెచ్చే విధానాన్ని దీర్ఘకాలంగా కొనసాగిస్తున్నాయన్నారు. ఈ ఆయుధాలను ఎవరైనా చట్టబద్ధంగా కొనుగొలు చేసే అవకాశం ఉండటం వల్ల ఎన్నోరకాల మారణకాండలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఓర్లాండో ఘాతుకంలో మరణించిన వారి కుటుంబాలను ఉపాధ్యక్షుడు జో బైడన్‌తో కలిసి పరామర్శించిన ఒబామా, తుపాకీ సంస్కృతిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. ఆయుధాల లభ్యత విషయంలో ఎలాంటి అవరోధాలు ఉండకూడదని చెబుతున్న వ్యక్తులు వీటివల్ల నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి తమ వాదనలో సహేతుకతను వివరించాల్సిన అవసరం ఉందని ఒబామా వెల్లడించారు. కఠినమైన చట్టాలను అమలు చేయకపోతే ఓర్లాండో తరహా పైశాచిక కృత్యాలకు అంతం ఉండదని, ఎందుకంటే ఆయుధాలను అందుబాటులోకి తేవడం ద్వారా ఇలాంటి వాటికి మనమే అవకాశం ఇస్తున్నట్టు అవుతుందని ఒబామా వివరించారు. అంతేకాదు, ఇంతగా దారుణాలు జరుగుతున్నా రాజకీయ నాయకులకు ఏమీ పట్టదన్న అభిప్రాయం కూడా బలపడే అవకాశం ఉంటుందని తెలిపారు.