రాష్ట్రీయం

వీణావాణి ఆపరేషన్‌పై మెల్‌బోర్న్ ఆస్పత్రి ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17:రాష్ట్రానికి చెందిన అవిభక్త కవలలు వీణ- వాణి శస్తచ్రికిత్స అవకాశాలపై మెల్‌బోర్న్‌లోని ప్రపంచ ప్రఖ్యాత రాయల్ చిల్డ్రన్స్ హాస్పటల్ డాక్టర్లతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి చర్చించారు. మెల్‌బోర్న్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు అయింది. ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్, డైరెక్టర్ ప్రొఫెసర్ పీటర్ మాక్ డొనాల్డ్, గ్లోబల్ పేషెంట్ కో ఆర్డినేటర్ మిస్ లోరకే, ఇతర వైద్యులతో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చర్చించారు. చికిత్సకు అవకాశం ఉందని ఆస్పత్రి నిపుణులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇది మొదటి భేటీ అని, ఇంకా ఒక అవగాహన రావడానికి కూలంకశంగా చర్చించాల్సి ఉందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఒక మంచి పనికి ముందుకు వచ్చిన మెల్‌బోర్న్ తెలంగాణ ఫోరం కార్యవర్గ సభ్యులు, సెక్రటరీ జనరల్ అనిల్ దీప్ చెర్లపల్లిని నిరంజన్‌రెడ్డి అభినందించారు.