రాష్ట్రీయం

వెలగపూడే శాశ్వతమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణం తాత్కాలికమా? శాశ్వతమా? అనేది అంతుపట్టడం లేదు. ముఖ్యమంత్రి పదే పదే తాత్కాలిక భవనాలేనని చెబుతున్నా, చేసే ఖర్చు, నిర్మాణాల తీరు చూస్తే శాశ్వత భవనాలను తలపిస్తున్నాయి. ఓవైపు 750 కోట్ల రూపాయల వ్యయంతో తాత్కాలిక సచివాలయ భవనాలను కడుతుండగా, దాని ఎదురుగానే అసెంబ్లీ భవన సముదాయాన్నీ ఇటీవలే ప్రారంభించారు. దీనికి అంచనా వ్యయంపై స్పష్టత రాలేదు. వచ్చే శాసనసభ సమావేశాలు రాజధాని ప్రాంతంలో నిర్వహిస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఆగస్టులో జరిగే వర్షాకాల సమావేశాల నిర్వహణకోసం సచివాలయం ఎదురుగానే లక్ష చదరపు అడుగుల పరిధిలో జీ ప్లస్ వన్ కింద అసెంబ్లీ భవనాలను నిర్మిస్తున్నారు. వాస్తు.. సంప్రదాయాల ప్రకారం శాసనసభ భవనాల డిజైన్లపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి సమాలోచనలు జరిపి ఆమోదయోగ్యమైన డిజైన్లకు రూపకల్పన చేశారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో శాసనసభ సమావేశ మందిరం.. ముఖ్యమంత్రి, సభాపతికి ప్రత్యేక చాంబర్లు, పై అంతస్తులో సభాసంబంధిత కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. తాత్కాలిక శాసనసభతోపాటుగా శాసనమండలి సమావేశాల నిర్వహణకు కూడా ఇదే ప్రాంగణంలో భవన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయ భవనాలను సుమారు 750 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. హడ్కో నుంచి తీసుకున్న 50 శాతం రుణాన్ని 10 శాతం వడ్డీతో 15 ఏళ్లలోగా చెల్లింపులు జరపాలి. శాశ్వత రాజధాని నిర్మాణం పూర్తయిన వెంటనే ఆ భవనాలను ప్రభుత్వం సీఆర్డీయేకు అప్పగిస్తుంది. వాణిజ్య సముదాయాల కాంప్లెక్స్‌గా దీన్ని మార్పు చేస్తారు. ఇందుకోసం జీ ప్లస్ 7 నిర్మాణాలకు అనువుగా పునాదులు నిర్మించారు. అదే తరహాలో శాసనసభ భవనాల నిర్మాణం జరుగుతోంది. అయితే పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. రెండు నెలల్లో నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలులేవు. ఇదిలాఉండగా తాత్కాలిక సచివాలయానికి ప్రభుత్వం రహదార్ల విస్తరణ జరుపుతోంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగుల రాకపోకలకు సౌకర్యంగా ఉండే విధంగా అంతర్గత రహదార్లను ఏర్పాటు చేస్తున్నారు.
శాశ్వత రాజధానికి
ఖర్చు లక్ష కోట్ల పైమాటే?
సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం శాశ్వత రాజధానిలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు, రాజభవన నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. మాస్టర్‌ప్లాన్ ప్రకారం శాశ్వత రాజధానికి రూ. లక్ష కోట్ల వ్యయం అవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం పూర్తిస్థాయిలో అందితే శాశ్వత నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. విదేశీ సంస్థలు రాజధాని అభివృద్ధికి అనేక షరతులు పెడుతున్నాయి. దీనికితోడు తాత్కాలిక నిర్మాణాలు.. రాజధానికి కొండవీటి వాగు వల్ల ముంపు నుంచి తప్పించేందుకు డిజైన్ల మీద డిజైన్లు రూపొందిస్తున్నారు. మూడుచోట్ల రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు ప్రకాశం బ్యారేజీ వద్దకు డైవర్షన్ స్కీముకు వేల కోట్లు వెచ్చించాల్సి వస్తుందని ప్రభుత్వం సంశయిస్తోంది. తాత్కాలికంగా కాల్వల విస్తరణ మాత్రం జరుపుతున్నారు. ఇక అమరావతి నిర్మాణానికి మాకీ అసోసియేట్స్ డిజైన్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా రూ. 90కోట్లు ప్రభుత్వం సంస్థకు చెల్లించింది. సంప్రదింపులకు ప్రభుత్వపరంగా ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది. అయితే స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణానికి డిజైన్లను కూడా మరోవైపు సేకరిస్తోంది. ఇదంతా వచ్చే మూడేళ్లలో పూర్తిచేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఇది సింగపూర్ మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా ఉంటుందా లేక సవరణలతో జరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే.

చిత్రం సచివాలయ ప్రాంగణంలో శాసనసభ భవన నిర్మాణ దృశ్యం