రాష్ట్రీయం

ఆదిభట్లలో ఏరోస్పేస్ స్టేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: టాటా-బోయింగ్ ఏరో స్పెస్ యూనిట్‌కు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శనివారం శంకుస్థాపన చేశారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన టాటా కంపెనీ, వందేళ్లు పూర్తిచేసుకున్న బోయింగ్ కంపెనీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఏరో స్పేస్ యూనిట్‌ను రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ప్రారంభించారు. రెండు నెలల్లో రక్షణ రంగ ఉత్పత్తులను ఈ యూనిట్ ప్రారంభిస్తుందని పారికర్ అన్నారు. టాటా- బోయింగ్ ఏరోస్పెస్ యూనిట్ ఏర్పాటు సంతోషకరమని, దీనివల్ల హైదరాబాద్ ఖ్యాతి మరింతగా పెరిగిందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో అన్ని పరిశ్రమలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు తీసుకుని తక్షణం అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు.