రాష్ట్రీయం

ఇక ఉపాధి వెల్లువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: టిఎస్‌ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఏడాదిలో పరిశ్రమల శాఖ సాధించిన అభివృద్ధిని శనివారం విలేఖరుల సమావేశంలో కెటిఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 2313 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, వీటి వల్ల 38,727 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, లక్షా 20 వేల 869 మందికి ఉపాధి లభించినట్టు చెప్పారు.
పరిశ్రమలు కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. టిఎస్‌ఐపాస్ ద్వారా ఏడవ విడతగా పరిశ్రమలకు అనుమతి పత్రాలు అందజేశారు. నిర్మాణ రంగంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, ఇసుకకు బదులు రాక్‌శాండ్‌తో నిర్మాణాలు చేపట్టేందుకు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అభినందిస్తున్నారని తెలిపారు. అనేక దేశాలకు చెందిన పరిశ్రమల వారు తమ పారిశ్రామిక విధానం గురించి అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. సులభతరంగా పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నాయని, పారదర్శకంగా విధానాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఉపాధి కల్పనా అవకాశాలు పెంచేలా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు తెలిపారు. 2015-16లో మైనింగ్ శాఖలో 2,772 కోట్ల రూపాయలు గడించినట్టు చెప్పారు. 2016-17లో నాలుగువేల కోట్ల ఆదాయం గడించడం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చెప్పారు. టిఎస్‌ఐపాస్ ద్వారానే ఆదిభట్లలో టాటా బోయింగ్
ఏరోస్పెస్ యూనిట్‌కు అనుమతి ఇచ్చామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ కంపెనీలు పెద్దఎత్తున రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరం తరువాత వరంగల్‌పై ఐటి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఐటి కంపెనీలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు తెలంగాణలో మంచి అవకాశం ఉందని, రక్షణ రంగం ఉత్పత్తులకు కేంద్రం కాబోతుందని తెలిపారు. పరిశ్రమలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు తీసుకోవడం వల్ల మంచి స్పందన కనిపిస్తోందని చెప్పారు. పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రదేశం అని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించినట్టు కెటిఆర్ తెలిపారు.

చిత్రం పారిశ్రామిక ప్రగతిపై నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడుతున్న మంత్రి కె తారక రామారావు