రాష్ట్రీయం

టెట్‌లో అర్హత సాధించలేదనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, జూన్ 18: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల్లో ఒక మార్కు తక్కువ రావడంతో అర్హత సాధించలేకపోయానన్న బెంగతో తీవ్ర మనస్తాపానికి గు రైన ఒక విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిజామాబాద్ జి ల్లా భిక్కనూరు మండలం తలమడ్ల గ్రామంలో శనివారం జరిగింది. కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామానికి చెందిన డిఇడి విద్యార్థిని ముదాం సుస్మిత ఇటీవల జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసింది. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని ఓ ఇంటర్నెట్ సెంటర్‌లో ఫలితాలు చూసుకుంది. బిసి వర్గానికి చెందిన సుస్మిత టెట్‌లో 74 మార్కులు సాధించింది. ఒక్కమార్కు తేడాతో అర్హత కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. సుస్మిత శుక్రవారం రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లి మణెమ్మ, తండ్రి నర్సింలు, కుటుంబ సభ్యులు కుమార్తె కోసం స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికారు. శనివారం ఉదయం తలమడ్ల గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై శవం కన్పించడంతో గ్రామస్థులు కామారెడ్డి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలిని సుష్మితగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తలమడ్ల రైల్వేస్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫాంపై మేడ్చల్ - నాందేడ్ ప్యాసింజర్ రైలు ఆగి ఉంది. అకోల - కాచిగూడ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ మరో రైల్వే లైన్‌మీదుగా వెళ్తుండగా పట్టాల మధ్యలోకి ఓ యువతి రావడాన్ని రైల్వే ప్రయాణికులు గుర్తించారు. రెప్పపాటులో రైలు ఢీకొనడంతో సుస్మిత తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.

సుస్మిత (ఫైల్ ఫొటో)