జాతీయ వార్తలు

పాడి రైతుపై పిడుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 18:అనంతపురం జిల్లా పాడి రైతుకు పెద్ద కష్టమే వచ్చింది. రోజువారీ పాల సేకరణను నిలిపివేయాలంటూ ప్రభుత్వ డెయిరీలకు అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో పాలను ఏం చేసుకోవాలో తెలియక రైతన్నలు బిక్క మొహం వేస్తున్నారు. దీనికి కారణం...ఏపి నుంచి పాలను కొనుగోలు చేయొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనని అధికారులు అంటున్నారు. దీంతో పాల సేకరణకు ప్రభుత్వ డెయిరీలలో భారీ ఏర్పాట్లు లేకపోవడంతో సేకరణ ఆపేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రైవేటు డెయిరీలకు కలసి వచ్చింది. తక్కువ ధరకు కొని లాభపడుతున్నాయి. ఎటొచ్చీ పాడిరైతే తీవ్రంగా నష్టపోతున్నాడు.
జిల్లాలోని దక్షిణ ప్రాంతాలైన హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లో వేలాది కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరంతా హిందూపురంలోని ప్రభుత్వ పాలశీతలీకరణ కేంద్రానికి ప్రతిరోజు 60 వేల లీటర్ల పాలు సరఫరా చేస్తున్నారు. వీటిని ట్యాంకర్లలో హైదారాబాద్‌తో పాటు ఒంగోలు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికంగా ప్రైవేటు డెయిరీలకూ విక్రయిస్తున్నారు. ఎపి నుండి పాలు సేకరించరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో హైదరాబాద్‌కు పాల సరఫరా ఆగిపోయింది. జిల్లా రైతుల నుండి సేకరించిన పాలను ఒంగోలులో పాల పౌడర్ తయారీ కోసం సరఫరా చేయడం ప్రారంభించారు. అయితే అక్కడ పాల నిల్వకు సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒంగోలుకు జిల్లా నుండి వెళ్ళిన పాల ట్యాంకర్లు అక్కడే ఉండిపోయాయి. దీంతో ఆదివారం నుంచి రైతుల వద్ద పాలు సేకరించరాదని ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేసింది. దిగాలు పడిన రైతుల్ని దోచుకునేందుకు ప్రైవేటు డెయిరీలు రంగంలోకి దిగాయి. హిందూపురం నియోజకవర్గంలో దాదాపు నాలుగు ప్రముఖ ప్రైవేటు డెయిరీలు రైతులను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీనిపై ఎపి డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ఒంగోలులో సమస్య ఉన్న మాట వాస్తవమేనని ఒకటి, రెండు రోజుల్లో దానికి పరిష్కారం కనుగొంటామన్నారు. ఒంగోలులో అవసరమైన సదుపాయాలు లేనందున ట్యాంకర్లు అక్కడే ఉండిపోయాయన్నారు. అక్కడ నిలువ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

హిందూపురంలోని పాల శీతలీకరణ కేంద్రం