రాష్ట్రీయం

ఆ కుటుంబాన్ని చంపాలనుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: బురిడీ బాబా శివతోపాటు మరో ఇద్దరు నిందితులకు మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విధించింది. ఇటీవల బంజారాహిల్స్‌లోని రియల్టర్ మధుసూదన్‌రెడ్డి ఇంట్లో పూజల పేరుతో రూ. 1.30 కోట్లతో శివబాబా ఉడాయించిన విషయం తెలిసిందే. శుక్రవారం దొంగబాబాను అరెస్టు చేసిన పశ్చిమ మండల వెస్ట్‌జోన్ పోలీసులు విచారించి అతని నుంచి 1.19కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వారికి కోర్టు రిమాండ్ విధించగా వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. శనివారం ఉదయం బురిడీ బాబా శివానందంతోపాటు ఈగ దామోదర్, గడప శ్రీనివాస్‌రెడ్డిలకు బంజారాహిల్స్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు. నిందితుల్లో శివబాబాకు సహరించిన ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా మరో నిందితుడు మోహన్‌రెడ్డి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇదిలావుండగా ఈ దొంగబాబా బారిన పడిన వారిలో చాలామంది పెద్దలు తమ ఆస్తుల వివరాలు బయటపడతాయన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నట్టు తెలుస్తోంది. బాబా బాధితుడు మధుసూదన్‌రెడ్డి రూ. 1.30కోట్లు ఎక్కడివని, వీటికి ఆదాయపు పన్ను కట్టారా? ఇప్పటి వరకు ఆదాయపు పన్ను చెల్లించారా అనే కోణం నుంచి ఇన్‌కంటాక్స్ అధికారులు ఆరా తీస్తుండగా, మరికొందరు శివబాబా బాధితులు ఇన్‌కంటాక్స్ అధికారుల నుంచి బయటపడేందుకు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని సమాచారం. కాగా దొంగబాబాను నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకుంటే మరిన్ని మోసాలు బయటపడొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందుకు కోర్టు ద్వారా పోలీసులు శివబాబాను కస్టడికి తీసుకునేందుకు యత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
డబ్బు కోసం కుటుంబానే్న చంపాలనుకున్నా..
డబ్బు కోసం మధుసూదన్‌రెడ్డి కుటుంబానే్న చంపాలనుకున్నానని బురిడీ శివబాబా పోలీసుల విచారణలో వెల్లడించాడు. మధుసూదన్‌రెడ్డికి పరిచయం చేసినందుకు మోహన్‌రెడ్డికి 20 వేలు కూడా ఇచ్చానన్నాడు. మోహన్‌రెడ్డితో కలసి అనేక మోసాలకు పాల్పడ్డానని, రైస్ పుల్లింగ్, మనీ డబ్లింగ్‌తో అమాయకులను మోసగించానని శివ పోలీసుల విచారణలో తెలిపాడు. కాగా శివ బాబాను ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడిందని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

చిత్రం శివబాబాను రిమాండ్‌కు
తరలిస్తున్న దృశ్యం