రాష్ట్రీయం

ఆధునిక టెక్నాలజీతో ఈవ్‌టీజర్ల భరతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: మహిళల వేధింపులకు కళ్లెం వేస్తూ, ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిని అదుపులోకి తీసుకొని కౌనె్సలింగ్ ఇస్తూ, సెల్‌ఫోన్లలో అసభ్యకర చిత్రాలు, మెసేజ్‌లు పంపేవారికి శిక్ష పడేలా హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘షీ’టీమ్స్ మంచి ఫలితాలనిస్తోంది. రెండేళ్ల క్రితం ప్రారంభించిన షీ టీమ్స్ బృందాలకు ఇప్పటి వరకు 548 మంది పట్టుబడ్డారని, 18వందల ఫిర్యాదులు వచ్చాయని నగర అదనపు కమిషనర్, షీ టీమ్స్ అధికారిణి స్వాతి లక్రా తెలిపారు. మహిళల రక్షణకు చేపట్టిన షీ టీమ్స్‌తో మహిళలు నిర్భయంగా తిరగగల్గుతున్నారని, మహిళా వేధింపుల కింద నమోదైన కేసుల్లో కొందరు నిందితులపై పిడి యాక్టు ప్రయోగించామని, కొందరికి కౌనె్సలింగ్ నిర్వహించి వదలిపెట్టామని, మరికొందరికి ఒక రోజు నుంచి పక్షం రోజుల వరకు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నామని స్వాతిలక్రా వివరించారు. వేధింపులకు పాల్పడే వారిని ఆధునిక టెక్నాలజీ వినియోగించి సాక్ష్యాధారాలతో పట్టుకుంటున్నామని పేర్కొన్నారు. సిసి కెమెరాల ఏర్పాటు ఆకతాయిలను పట్టుకునేందుకు ఎంతో దోహదపడుతున్నాయని, సిసి కెమెరాల ఫుటేజీల ఆధారంగా పలు కేసులు నమోదైనట్టు ఆమె వివరించారు. ఈ-మెయిల్, ఫేస్‌బుక్, ఫోన్ మెసేజ్‌ల ద్వారాకూడా ఫిర్యాదు చేస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.