ఆంధ్రప్రదేశ్‌

సీలింగ్ ఫ్యాన్లతో విద్యుత్ పొదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: రాష్ట్రంలో విద్యుత్ పొదుపును ఉద్యమంలా చేపట్టే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 20వ తేదీ సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో శ్రీకారం చుట్టనున్నారు. విద్యుత్ పొదుపు సంరక్షణ విధానాల్లో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలపై ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ సమీక్షించారు. అనంతరం రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్యాన్లను నర్సాపురంలోని వినియోగదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తారని చెప్పారు. ఒక ఫ్యాను రేటు రూ.1174 కాగా, 24 వాయిదాల్లో వినియోగదారుడు విద్యుత్ శాఖకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్యాన్ల వినియోగం వల్ల సాలీనా 5.50 మెగావాట్ల విద్యుత్ ఆదా అవుతుందని, రూ.5.81 కోట్లు మిగులుతాయన్నారు. రాష్ట్రంలో రానున్న ఐదు సంవత్సరాల్లో అదనంగా 11,210 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికను ఖరారు చేసినట్లు అజయ్ జైన్ తెలిపారు. దీనికోసం దాదాపు రూ. 65,249 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. రాయలసీమ థర్మల్ ప్రాజెక్టులో స్టేజి 4 కింద 600 మెగావాట్లు, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ 50 మెగావాట్లు, విజయవాడ థర్మల్ ప్లాంట్ ఐదవ స్టేజిలో 800 మెగావాట్లు, కృష్ణపట్నం థర్మల్ ప్రాజెక్టు కింద 800 మెగావాట్లు, ఓడరేవు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కింద 4000 మెగావట్లు, పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా 960 మెగావాట్లు, శ్రీకాకుళం థర్మల్ ప్లాంట్ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 650 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. రాయలసీమ థర్మల్ స్టేజి -4 ప్రాజెక్టుకు రూ. 3525 కోట్లు, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌కు రూ. 225 కోట్లు ఖర్చవుతుందన్నారు.