ఆంధ్రప్రదేశ్‌

త్వరలో స్మార్ట్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్టవ్య్రాప్తంగా త్వరలో స్మార్ట్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. నిధుల కొరత కారణంగా ఎన్నికల హామీల అమలు నత్తనడక నడుస్తుండటం, పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకా అన్నట్లుగా గతంలో తెలంగాణాలో కేసిఆర్ జరిపిన విధంగా స్మార్ట్ సర్వే పేరిట చంద్రబాబునాయుడు సరికొత్త సర్వేకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనిలో భాగంగా ఎన్యూమరేటర్లు గ్రామస్థాయి నుంచి ఇంటింటికి వచ్చి తలుపుకొట్టి అనేక వివరాలు సేకరించనున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం 20 రకాల పత్రాలను సిద్ధం చేసింది. దీంతోపాటు డేటాను కూడా నమోదు చేయాల్సి ఉంది. ఈ పత్రాలకు సంబంధించి సమాచారాన్ని అందించేందుకు ప్రతి ఇంటి యజమాని కూడా సిద్ధం కావాల్సి ఉంది. సమాచారాన్ని సేకరించనున్న ఎన్యూమరేటర్లకు త్వరలోనే శిక్షణా కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ప్రతి ఇంటికి ఇంటి నెంబరు ఇచ్చేందుకే ఈ సర్వే జరుపుతున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ ప్రభుత్వం సేకరించనున్న సమాచారం ఆందోళన కలిగించే రీతిలోనే కనిపిస్తోంది. రెండు దశాబ్దాల క్రితం నాటి కేంద్ర ప్రభుత్వం ఆరింట ఏ ఒక్కటి ఉన్నా ఆదాయపు పన్ను డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను ప్రవేశపెట్టినప్పుడు మూడు పూటల తినటానికి తిండిలేని వారు సైతం భయభ్రాంతులకు గురై తమకున్న టెలిఫోన్ కనెక్షన్‌ను కూడా రద్దుచేసుకోటం జరిగింది. తాజాగా ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి జియో ట్యాగింగ్ విధానంలో ఆన్‌లైన్ ద్వారా కూడా వివరాలు సేకరించనున్నారు.
ఇంటింటి సర్వే సందర్భంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఆస్తుల పత్రము, కరెంట్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం లేదా స్థల ఖాతా నెంబరు, ఎల్‌పిజి కన్స్యూమర్ పుస్తకం, బ్యాంక్ పాసు పుస్తకం, సధారమ్ సర్ట్ఫికెట్, వాటర్ బిల్లు, కులపత్రము (ఎస్‌సి, ఎస్‌టి, బిసి), జీతము యొక్క పత్రము, కిసాన్ కార్డు, పెన్షన్ సర్ట్ఫికెట్, ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్వాక్రా ఎన్‌హెచ్‌జి మెంబరు కార్డు, జనన ధ్రువపత్రము (5ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు లేకపోతే), పెరామెట్రిక్ స్కాలర్‌షిప్ ఐడి (అందుబాటులో ఉంటే) వీటికి అదనంగా మరింత సమాచారంపై అంశాల పరిధిలోనికి రానివి కూడా పరిగణనలోకి తీసుకుని చంద్రన్న బీమా తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.