తెలంగాణ

రోడ్ల నిర్వహణ ప్రైవేటుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: రాజధాని నగరంలో రోడ్ల పరిస్థితి, రవాణా, పారిశుద్ధ్య పరిస్థితి మెరుగు పడేందుకు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు నేతృత్వంలో సోమవారం జరిగిన కీలక సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని నగరానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేశారు. దేశంలో, ఇతర దేశాల్లో వివిధ నగరాల్లో అమలు జరుగుతున్న విధానాలను అధ్యయనం చేసి వాటిని రాజధాని నగరంలో అమలు చేయడానికి ఉన్న అవకాశాలను ఇన్నోవేషన్ సెల్ పరిశీలిస్తుంది. ప్లాస్టిక్ రోడ్లను ఏర్పాటు చేయడానికి రాజధానిలో అవకాశం ఉందా అనే అంశంపై ఈ సెల్ పరిశీలిస్తుంది. అస్తిపన్ను రివిజన్ కోసం అధ్యయనం చేయాలని నిర్ణయించారు. నగర రవాణా వ్యవస్థ బలోపేతానికి యుఎంటిఎ (యూనిఫైడ్ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియలో మార్పులు తెస్తారు. మార్పులు సూచించేందుకు చీఫ్ ఇంజనీర్ల కమిటీని ఏర్పాటు చేస్తారు. నగరాన్ని ఎన్ని యూనిట్లు, జోన్‌లుగా మార్చాలో ఈ కమిటీ నిర్ణయిస్తుంది. నగరంలో ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేస్తారు. జిహెచ్‌ఎంసిలోని ఖాళీలను భర్తీ చేస్తారు. రంగారెడ్డి, హైదరాబాద్‌లో నిర్మాణం అయిన 30వేలకు పైగా ఉన్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లను రెండు నెలల్లో పంపిణీ చేస్తారు. నగరంలో చెట్లను తొలగించడం లేదని, వాటిని ట్రాన్స్‌లొకేట్ చేస్తామని చెప్పారు. ఒకే రోజు 25లక్షల మొక్కలను హైదరాబాద్‌లో నాటనున్నట్టు చెప్పారు. కెబిఆర్ పార్కు చుట్టూ తిరుగుతున్న మేధావులు, కార్యకర్తలు 25లక్షల మొక్కలు నాటుతున్న విషయాన్ని గుర్తించాలని కెటిఆర్ సూచించారు.