ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా పుష్కరాలకు 600 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: కృష్ణా పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైల్వే ఉన్నతాధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తూ విజయవంతంగా నిర్వహించాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలిసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం రాత్రి వీరు ఇక్కడ సమావేశమై పుష్కరాల నిర్వహణకు సంబంధించి చర్చించారు. పుష్కరాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 600 ప్రత్యేక రైళ్లు నడపాలని, రద్దీని దృష్టిలో వుంచుకుని అందుకనుగుణంగా రైళ్లు నడిపేందుకు ఎప్పుడూ రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులో వుంచుకోవాలని నిర్ణయించారు. యాత్రికులు రైల్వే టిక్కెట్ కోసం స్టేషన్‌కు వెళ్లకుండానే పుష్కర నగర్‌లలోనే కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం 2వేల సిసి కెమెరాలను రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి ఏర్పాటు చేస్తారు. నదిలో స్నానమాచరించే భక్తులకు అసౌకర్యం లేకుండా 20వేల మంది క్లీనింగ్ సిబ్బందిని విధుల్లో వుంచుతారు. పుష్కరాలకు సంబంధించిన కీలక పనులను జూలై 15లోపు పూర్తిచేయాలని ఉభయులూ నిర్ణయించారు. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం కలిసి జాయింట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రద్దీ ఎక్కువైనప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్లాన్-ఎ, ప్లాన్-బి అనే రెండు రకాల ప్రత్యామ్నాయ ప్రణాళికా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.