రాష్ట్రీయం

గవర్నర్ దంపతుల యోగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: మానవుల్లోని అన్ని రకాల శారీరక, మానసిక రుగ్మతలకు యోగ ఆసనాలు అద్భుతమైన నివారిణి అని, ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే ప్రతి వ్యక్తి ప్రతి రోజూ కొంతసేపుయోగ ఆసనాలు, ధ్యానం చేయాలని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. మానసిక ఒత్తిళ్లు, ఆందోళన లక్షణాల నుంచి విముక్తి పొందేందుకు యువకులు తప్పనిసరిగా యోగ ఆసనాలు చేయాలన్నారు.
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో యోగ ఆసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సతీమణి విమలా నరసింహన్, గవర్నర్ సలహాదారులు ఏపివిఎన్ శర్మ, ఎకె మహంతి, ముఖ్య కార్యదర్శి హరిప్రీత్ సింగ్, ఏపి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి బసంత్ కుమార్, అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. యోగ గురువు రవికిషోర్ ఒక గంట సేపు యోగఆసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆహుతులకు తృణ ధాన్యాల కిచిడీ, ఉప్మా, రాగి జావాను ఇచ్చారు. తృణ ధాన్యాలతో రూపొందించే వివిధ వంటలపై ఒక పుస్తకాన్ని కూడా పంపిణీ చేశారు.
బైసన్ గ్రౌండ్స్‌లో..
రాజధానిలోని బైసన్ గ్రౌండ్స్‌లో బైసన్ ఆర్మీ డివిజన్ యోగ ఆసనాల కార్యక్రమాన్ని నిర్వహించింది. సైనికులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. మానసిక, శారీరక ఒత్తిళ్ల నుంచి సైనికులు యోగ ద్వారా ఉపశమనం పొందవచ్చునని బొలారం, బోయినపల్లి, మెహదీపట్నం, గొల్కొండ ఆర్మీ మైదానాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆర్మీ అధికారులు తెలిపారు. బైసన్ మైదానంలో 3500 ఆర్మీ కుటుంబాలు అంతర్జాతీయ యోగ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

చిత్రం రాజ్‌భవన్‌లో యోగ ఆసనాలు చేస్తున్న గవర్నర్ దంపతులు.