రాష్ట్రీయం

15శాతం వృద్ధిరేటు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాలకు 10.62శాతం వృద్ధిరేటు లక్ష్యంగా నిర్ధారించుకోగా 1.15శాతం అధికంగా 11.77శాతం మేర వృద్ధిరేటు సాధించగలిగామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇదే కాలానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సాధించిన వృద్ధిరేటు 7.2శాతంతో పోలిస్తే రాష్ట్రంలో 4.57శాతం అదనంగా సాధించగలిగామన్నారు. ఆర్థిక సంవత్సరాంతానికి 15శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. 2018 నాటికి అమరావతిలో చేపట్టే 9 నగరాల్లో ముందుగా పరిపాలనా నగరాన్ని పూర్తిచేసి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తామన్నారు. స్టార్ హోటళ్లలో పరిపాలనపరమైన సమావేశాలు ఇకముందు జరగబోవన్నారు. స్థానిక తాజ్ గేట్‌వే హోటల్‌లో రెండురోజులు జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేస్తూ సృష్టించిన సంపద ఫలాలు పేదలకు అందేలా ప్రభుత్వ యంత్రాంగం కృషిచేయాలని కోరారు. ప్రధానంగా రెండంకెల వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా కలెక్టర్లకు దిశ, దశా నిర్దేశిస్తూ రానున్న ఆరునెలల కాలానికి రూపొందించాల్సిన ప్రణాళికలు, కార్యాచరణపై చంద్రబాబు మార్గదర్శనం చేశారు. స్థానిక అంశాల ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకుని మంత్రులు, కలెక్టర్లు ఇతర జిల్లాలతో పోటీపడుతూ తమ జిల్లాల అభివృద్ధికి రూపకల్పన చేయాలన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగానికి సంబంధించి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని ఆయన చెప్పారు. అయితే 60శాతం గ్రామీణ జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ధిరేటు సాధిస్తే సమాజానికి ఆర్థిక భద్రత చేకూరుతుందన్నారు. ఇందుకోసం రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వివిధ పథకాల ద్వారా కృషిచేస్తున్నామని వివరించారు. కేవలం వ్యవసాయ అనుబంధ రంగాల్లో 47.10శాతం వృద్ధిరేటు సాధించామని, మత్స్య పరిశ్రమలో రికార్డు స్థాయిలో 119శాతం వృద్ధిరేటు నమోదైందని తెలిపారు. లైవ్‌స్టాక్‌లో 28.39శాతం, అన్నింటి కంటే తక్కువగా పరిశ్రమల రంగంలో 6.2శాతం, సర్వీస్ రంగంలో 8.04శాతం వృద్ధిరేటు సాధించగలిగామన్నారు. చేపల ఎగుమతుల్లో దేశంలోనే మనం ముందున్నామని, వ్యాధులు నిరోధించగలిగితే మత్స్య రంగంలో మనకు తిరుగులేదన్నారు. 2022 నాటికల్లా దేశంలోనే మొదటి మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని, 2029 నాటికి దేశంలో అగ్ర రాష్ట్రం కావాలని, 2050 నాటికల్లా ప్రపంచంలోనే అత్యున్నత స్థానానికి చేరాలన్న విజన్‌తో పనిచేస్తున్నామని వివరించారు. ఇవి నెరవేరాలంటే ఫోకస్ అప్రోచ్‌తో ముందుకు వెళ్లాలని చంద్రబాబు ఉద్బోధించారు. అయితే ఇందుకోసం సంపద సృష్టించాల్సి వుందన్నారు. ఇదే సమయంలో సంక్షేమ పథకాలను పక్కాగా అవినీతి రహితంగా, అసమానతలు పోయేలా అమలుపర్చాలన్నారు.
రుణమాఫీ తొలివిడతలో రూ.8,400 కోట్లు విడుదల చేశామని, వచ్చే ఫిబ్రవరి కల్లా రెండోవిడత రుణమాఫీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తామని చంద్రబాబు తెలిపారు. డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేశామని, అయితే వారికి మళ్లీ బ్యాంకర్లు రుణాలు ఇస్తున్నారో, లేదో అధికారులు గమనించాలన్నారు. రాష్ట్రంలో మరో 40లక్షల వంటగ్యాస్ కనెక్షన్లు అందించగలిగితే ప్రతి ఒక్కరికీ గ్యాస్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇలా ఎన్ని పథకాలు తీసుకొచ్చినా, ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా వాటిని జిల్లాస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాల్సింది కలెక్టర్లే అన్నారు. ఆరోగ్యం, విద్యారంగాల్లో వృద్ధి సాధిస్తే మినహా అనుకున్న లక్ష్యాలకు చేరుకోలేమన్నారు. అధికారులు దృష్టిపెట్టినచోట స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమం విజయవంతమైందన్నారు. జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో ఇళ్లస్థలాలు, రేషన్, ల్యాండ్ రికార్డు వంటి సమస్యలను పూర్తిగా పరిష్కరించాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరతను అధిగమించాలంటే అనేక మార్గాలను అనే్వషించాల్సి వుందన్నారు. ఇందుకు ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్‌ప్లాన్ నిధులతో పాటు ఎంపి ల్యాడ్స్, వివిధ కార్యక్రమాల కింద కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించాలన్నారు.
వచ్చే ఏడాది పట్టిసీమ ద్వారా 80 టిఎంసిలు, మధ్యలో ప్రవహించే చిన్నచిన్న నదులు, కాలువల నుంచి మరో 20 టిఎంసిల నీటిని కృష్ణాడెల్టాకు వినియోగించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈనెలాఖరు నాటికి కిజోమీటర్ల ఏర్పాటు పూర్తవుతుందన్నారు. 3,4 అడుగుల్లోనే నీరు అందేలా భూగర్భ జలమట్టాలను పెంచేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. రానున్న వేసవిలో కర్నూలు, విజయనగరం జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లోని మెట్టప్రాంతాల్లో సాగునీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉన్నందున కలెక్టర్లు ముందుగానే అప్రమత్తం కావాలని చంద్రబాబు ఆదేశించారు.
విద్యుత్ రంగ ప్రగతిపై సంతృప్తి
విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ లోటును అధిగమించి మిగులు సాధించామన్నారు. జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు సాధించగలిగామన్నారు. మిగిలిన శాఖలు ఇదే స్ఫూర్తితో శ్రమిస్తూ వృద్ధిలో కేంద్రంలోని శాఖలతో పోటీపడాలన్నారు. వచ్చే జూన్ నాటికి రాష్టమ్రంతా ఫైబర్ గ్రిడ్ అందుబాటులోకి వస్తుందన్నారు.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

త్వరలో ఇసి నియామకం
హైకోర్టుకు తెలిపిన ఏపి ప్రభుత్వం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 14: ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఎన్నికల కమిషనర్‌ను త్వరలోనే నియమిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. గవర్నర్‌కు రెండు వారాల కిందటే ఫైల్ పంపించడం జరిగిందని, అక్కడ నుంచి అనుమతి రాగానే ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తామని ప్రభుత్వం వివరించింది. కాకినాడ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలన్న పిటీషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వానికి పై వివరణ ఇచ్చారు. ఎన్నికల కమిషనర్‌ను నియమించగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. అనంతరం ఈ కేసును రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.