ఆంధ్రప్రదేశ్‌

సేవల్లో నాణ్యత..పాలనలో నవ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: ప్రతి నెలా ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా పురపాలక సంఘాల్లో పనితీరు మెరుగుపరచుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో 80 శాతం ప్రజల మద్దతు ఎన్నికల్లో తమకే లభించిందని, ప్రజల నుంచి అంతే మొత్తంలో సంతృప్తి ఫలితాలను కూడా రాబట్టాల్సి ఉందని ఆయన అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణాలు, నగరాల్లో నివసించేవారి అంచనాలు, ఆశలు చాలా చిన్నవిగానే ఉంటాయని, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండి, నిరంతరం మంచినీటి సరఫరా చేస్తే చాలునని వారు భావిస్తుంటారని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అమృత్’ పథకం పట్టణ ప్రాంతాలకు ఒక వరమని, దీని ఊతంతో రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలే మారిపోనున్నాయని అన్నారు.
సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని, 43 లక్షల మందికి పెన్షన్లు అందిస్తూ 500 కోట్ల మేర ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 4 కోట్ల మందికి ఐదు కిలోల చొప్పున రేషన్ అందిస్తున్నామని, మొత్తం జనాభాలో 80 శాతం మంది నేరుగా సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కోటీ 50 లక్షల మందికి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఇంటికి రెండు బల్బుల చొప్పున అందించామని చెప్పారు. ప్రతి పట్టణంలో వీధులు సౌర విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయని అన్నారు. దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ కింద ఇంటింటికీ ఇంటర్నెట్ అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికీ టాయిలెట్, అన్ని ముఖ్య కూడళ్లలో పబ్లిక్ టాయిలెట్స్, రెండు, నాలుగు వరసల రహదారులు, ఇతర వౌలిక సదుపాయాలతో పట్టణ ప్రాంతాల ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామని అన్నారు. పౌర సేవలన్నీ ఆన్‌లైన్ చేయడం ద్వారా అవినీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా చేశామని సిఎం గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా పట్టణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, పెద్దఎత్తున ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలతో ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు కల్పిస్తున్న సదుపాయాలు, సేవల్లో మరింత నాణ్యత కనబర్చేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. పౌర సేవల్ని అవుట్ సోర్సింగ్ చేయడం ద్వారా ప్రజలకు భరోసా ఏర్పడిందని చెప్పారు. ప్రజల అవసరాలు గుర్తించడంలో అధికారులు వెనకబడరాదని, ముఖ్యంగా వారికి ప్రభుత్వం కల్పిస్తున్న ఆహార భద్రత, ఉద్యోగ భద్రత, విద్యుత్ భద్రత, సమాచార భద్రత, నీటి భద్రత సక్రమంగా చేరుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.