జాతీయ వార్తలు

అంతరిక్షంలోకి 20 ఉపగ్రహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరి కొన్ని గంటల వ్యవధిలోనే మరో మైలురాయిని అధిగమించనుంది. ప్రతి ప్రయోగానికి సరికొత్త ఆలోచనతో శ్రీకారం చుట్టే ఇస్రో శాస్తవ్రేత్తలు ఈసారి ఏకంగా ఒకేసారి 20 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ఇందుకు షార్ కేంద్రం వేదిక కావడమే కాకుండా ఇస్రో నమ్మినబంటు పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారానే 17 విదేశీ, 3 స్వదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి బుధవారం ఉదయం 9:26 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ప్రయోగం చేపడుతున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 9:26గంటలకు ప్రారంభమై సజావుగా కొనసాగుతోంది. కౌంట్‌డౌన్‌లో భాగంగా మంగళవారం రాకెట్‌లోని ప్రతి భాగాన్ని పనితీరును క్షుణ్ణంగా పరిశీలించినంతరం రెండో దశలో ద్రవ ఇంధనం, హీలియం గ్యాస్ నింపే కార్యక్రమాన్ని శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ షార్‌కు చేరుకొని ప్రయోగ పర్యవేక్షణలో ఉన్నారు. ముందుగా ఆయన షార్ డైరెక్టర్ పి కున్హికృష్ణన్, శాస్తవ్రేత్తలతో కలసి ప్రయోగ వేదిక వద్దకు చేరుకొని కౌంట్‌డౌన్ పనితీరును పర్యవేక్షించారు. అనంతరం శాస్తవ్రేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రయోగం పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ రాకెట్ ద్వారా 1288 కిలోల బరువుగల మన దేశానికి చెందిన కార్టోశాట్-2సి, చెన్నై, పూణె విద్యార్థులు రూపొందించిన సత్యభామ శాట్, స్వయం శాట్‌తోపాటు ఇండోనేసియాకు చెందిన 1, జర్మనీ 1,కెనడా 2, అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలతో కలపి మొత్తం 20 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి-సి 34 వాహక నౌక ద్వారా భూమి నుండి 505కిలో మీటర్ల దూరంలో సూర్యనువర్తమాన కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 26 నిమిషాల్లో ప్రయోగం పూర్తికానుంది. ఇప్పటివరకు షార్ నుండి 35 పిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగాలు జరగగా మొదటి ప్రయోగం మినహా అన్ని విజయవంతమయ్యాయి. ఇప్పటివరకు 10 ఉపగ్రహాలను మాత్రమే 2008లో చంద్రయాన్ ద్వారా పంపించి విజయం సాధించింది. ఇప్పటి వరకు అమెరికా మాత్రమే 29 ఉపగ్రహాలను పంపించి ఉంది. ఇది విజయవంతమైతే ఇస్రో ప్రపంచ దేశాల్లో అధిక ఉపగ్రహాలు పంపిన దేశంగా అమెరికా తరువాత స్థానంలో నిలవనుంది.

చిత్రం ప్రయోగానికి సిద్ధంగా ఉన్న పిఎస్‌ఎల్‌వి సి-34 రాకెట్