తెలంగాణ

గురుకుల పాఠశాలల్లో 4616 పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 103 గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కళాశాలల్లో బోధనా, బోధనేతర సిబ్బంది 4616 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవ్వే కాకుండా గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలో 733 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేసుకోవడానికి కూడా ఆర్థిక శాఖ అనుమతించింది. గురుకుల పాఠశాలలో 103 పోస్టుల చొప్పున ఫిజికల్ డైరెక్టర్, పిఇటీ, లైబ్రెరియన్, స్ట్ఫా నర్స్, క్రాఫ్ట్ ఆర్ట్, మ్యూజిక్ టీచర్, సీనియర్ అసిస్టెంట్‌ల భర్తీకి అనుమతించింది. అలాగే 927 టిజిటి పోస్టులు, 721 జూనియర్ లెక్చరర్, పిజిటి పోస్టుల చొప్పున భర్తీకి అనుమతించింది.
వీటితో పాటు కొత్తగా ఏర్పాటు చేయనున్న 30 డిగ్రీ కళాశాలలకు 1080 లెక్చరర్ పోస్టులు, 30 చొప్పున ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్, సూపరింటెండ్‌ంట్, హెల్త్ సూపర్‌వేజర్, అసిస్టెంట్ లైబ్రరీయన్ పోస్టులకు అనుమతించింది. కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 120, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 60 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతించింది. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా 103 ఐసిటి ఇన్‌స్ట్రక్టర్, డాటా ఎంట్రీ అపరేటర్స్, ఆఫీస్ సబార్డినేట్ 206 పోస్టులకు, జూనియర్ అసిస్టెంట్, మ్యూజియమ్ కీపర్, ఆఫీస్ సబార్డినేట్/రికార్డు అసిస్టెంట్ 120 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.