తెలంగాణ

స్మార్ట్‌సిటీల నిర్మాణానికి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: తెలంగాణలో స్మార్ట్ సిటీల నిర్మాణంలో తామూ సహకరిస్తామని బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ యాష్‌క్విన్త్ హామీ ఇచ్చారు. రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు బుధవారం నగరంలో బ్రిటిష్ హైకమిషనర్ (ఇన్ ఇండియా) డొమినిక్ యాష్‌క్విన్త్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటీష్ హైకమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ఐటి పారిశ్రామిక కార్యక్రమాలను, రూపొందించిన పథకాలను, టిఎస్ ఐపాస్ విధానాన్ని వివరించారు. టిహబ్ కార్యక్రమం పరిశోధనలకు ఊతం లభిస్తుందని, టిహబ్‌ను ఇప్పటికే 8 రాష్ట్రాలు సందర్శించాయని, ఇలాంటి కార్యక్రమాలను చేపట్టేందుకు అవి ఆలోచన చేస్తున్నాయని ఆయన తెలిపారు. బ్రిటన్‌లోని స్మార్ట్ ఆఫ్ ఈకో సిస్టంతో భాగస్వామ్యానికి ఇరువురు సంసిద్ధత వ్య క్తం చేశారు. దేశంలోని కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు, పన్నులు, ఆదాయం వంటి అనేకానేక అంశాలపై మంత్రి కెటిఆర్ హైకమిషనర్‌కు వివరించారు. దేశాన్ని ఒక యూనిట్‌గా చూడకుండా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు, సౌకర్యాలు, పాలసీల ఆధారంగా చూడాలని మంత్రి కోరారు. తాము ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నామని, ఇది తమ ప్రభుత్వ పని తీరును తెలియజేస్తున్నదని ఆయన వివరించారు. తమ ప్రభుత్వానికి ఐటి, ఫార్మ, లైఫ్ సైనె్సస్, ఏరోస్పెస్ వంటి రంగాలు ప్రాధాన్య రంగాలని చెప్పారు. డొమినిక్ స్పందిస్తూ క్లీన్‌టెక్ రంగంలో తమ దేశ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. పెట్టుబడుల అవకాశాలను పెంచేందుకు ఇండో బ్రిటీష్ బిజినెస్ కౌన్సిల్ మరింత చురుగ్గా పని చేసేలా చూస్తామని ఆయన తెలిపారు.
గవర్నర్‌తో భేటీ..
కాగా బ్రిటీష్ హైకమిషనర్ డొమినిక్ బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన సిఎల్‌పి నేత కె. జానారెడ్డిని, కౌన్సిల్‌లో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీని కలిసారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని ఆయన వారిని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ఆకర్షణీయమైన వాగ్దానాలతో ప్రజలను మోసగించిందని వారు ఆయనకు చెప్పారు.

హైదరాబాద్‌లో బ్రిటిష్ హైకమిషనర్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న మంత్రి కెటిఆర్