రాష్ట్రీయం

తరలిపోయన ఐదు శాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు హైదరాబాద్ నుండి అమరావతికి తరలించే ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది. 27వ తేదీ నుండి అమరావతి నుండే కార్యకలాపాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ ప్రభుత్వ శాఖల అధిపతుల కార్యాలయాల తరలింపు మొదలైంది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న సహకార సంఘాలు, అనుబంధ కార్యాలయాలు తరలింపు మొదలైంది. వైద్యం ఆరోగ్యం, విద్య, అటవీ, మహిళా సంక్షేమం, సమాచార శాఖ, ఆర్టీసీలోని ఉద్యోగులు అంతా అమరావతికి తరలివెళ్లారు. పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ సిబ్బంది కొంతమంది తరలివెళ్లారు. వివిధ శాఖల్లో న్యాయవిభాగాలు సహా కొద్దిమంది అమరావతికి తరలివెళ్లాల్సి ఉంది.
ఉద్యోగులు అమరావతికి తరలిరావల్సిందేనని స్పష్టంగా ఆదేశించినా, ఆగస్టు 31 వరకూ తరలింపునకు ప్రభుత్వం అనధికారికంగా అనుమతి ఇచ్చింది. సచివాలయ సిబ్బంది పూర్తిగా వెలగపూడికి మారడంతో ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుంది. మరో రెండు రోజుల్లో వెలగపూడిలో రెండు ఫ్లోర్లు సిద్ధమవుతాయి. వాటిలో ఒకదాంట్లో సిఎం, సిఎస్‌లకు కేటాయించి, మరో ఫ్లోర్‌ను సచివాలయ సిబ్బందికి కేటాయించనున్నారు. మిగిలిన నాలుగు ఫ్లోర్లు పూర్తయిన తర్వాత సిబ్బంది పూర్తిస్థాయి సర్దుబాటు జరుగుతుంది. మరోపక్క విజయవాడ, గుంటూరు పట్టణాల్లో వంద భవనాలను ఇప్పటికే మున్సిపల్ శాఖ తమ ఆధీనంలోకి తీసుకుని అందుబాటులో ఉంచింది. వాటిని చూసి తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని శాఖాధిపతులకు కొంత మందికి ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. కొన్ని భవనాలను అధికారులు ఎంపిక చేసినా, చాలావరకూ అయిష్టంగానే ఉన్నట్టు తెలిసింది. అధికారులే స్వయంగా విజయవాడ నగరానికి వెళ్లి ఇబ్రహీంపట్నం సమీపంలో అదనంగా కొత్త భవనాలను ఎంపిక చేశారు.
రాష్ట్ర హైకోర్టు కార్యకలాపాలు అన్నీ మరి కొంతకాలం హైదరాబాద్‌లోనే కొనసాగాల్సి ఉన్నందున అన్ని విభాగాల్లోని లీగల్ సెల్‌లను హైదరాబాద్‌లోనే కొనసాగించడం ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితిలోగా దాదాపు 55 శాతం శాఖల తరలింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. అన్ని శాఖలకు ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రొఫార్మా ఇవ్వడంతో పాటు ఏయే ఉద్యోగులు విజయవాడ , గుంటూరు పట్టణాలకు చేరుకుంటున్నారో, వారు తమ విధులకు ఎక్కడ రిపోర్టు చేయాల్సి ఉందో కూడా ప్రభుత్వం సూచనలు చేసింది. కొంత మంది అమరావతి, విజయవాడ, గుంటూరు పట్టణాలకు చేరుకున్నా వారం పది రోజుల వరకూ అక్కడ పని ఉండే పరిస్థితి లేకపోవడంతో స్థానిక కార్యాలయాల్లో రిపోర్టు చేసి అక్కడి నుండే విధులు నిర్వహించాలని కూడా కొన్ని శాఖలకు మార్గదర్శకాలు వెళ్లాయి. హైదరాబాద్ నుండి శాసనసభ సిబ్బంది, శాసన మండలి సిబ్బంది, సచివాలయ సిబ్బంది ఇంకా తరలి వెళ్లాల్సి ఉంది. ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులు, సహచరులు ఘనంగా వీడ్కోలు పలికారు, ఈ సందర్భంగా ఉద్యోగులు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు.

చిత్రం ఐఅండ్‌పిఆర్ శాఖలోని సామగ్రిని తరలిస్తున్న దృశ్యం

చిత్రం గురువారం హైదరాబాద్‌లో ఏపి ఉద్యోగులకు వీడ్కోలు పలుకుతున్న తెలంగాణ ఐఅండ్‌పిఆర్ ఉద్యోగులు