తెలంగాణ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. నేనే సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూన్ 24: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తానే సిఎంనని సిఎల్‌పి నాయకుడు కుందూరు జానారెడ్డి అన్నారు. సాగర్ నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకులు, జానారెడ్డి అనుచరులు టిఆర్‌ఎస్‌లో చేరిన తరువాత మొదటిసారిగా నాగార్జునసాగర్‌కు వచ్చిన ఆయనను కలవడానికి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. వారందరిని ఉద్దేశించి తన నివాసంలో జానారెడ్డి మాట్లాడారు. ప్రజలంతా కోరిన విధంగా పదవులన్నీ పోగొట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకొస్తే తానే సిఎం అవుతానని అన్నారు. ఇటీవల తన అనుచరులను టిఆర్‌ఎస్‌లోకి తానే పంపించానని, తనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నారని వాటిని నమ్మవద్దన్నారు. జానారెడ్డి ఎప్పుడూ ముందు నడిస్తే వెనుక వచ్చేవారే టిఆర్‌ఎస్ పార్టీలో చేరారని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారు ఏం ఉపయోగం ఉండి వెళ్లారో వారికే తెలియాలని, ఆ దేవుడికే తెలియాలని లేదా వారికి పట్టిన దయ్యానికే తెలియాలని ఆయన వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిని అయినా కాకపోయినా ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధానమంత్రులతో భేటీ అయి మాట్లాడే స్థాయి ఉందని జానారెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ అని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ రిజర్వేషన్లను పెంచుతామని టిఆర్‌ఎస్ నాయకులు మాయమాటలు చెప్తున్నారని, కాని టిఆర్‌ఎస్ 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నా అమలు చేయలేరని జానారెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల సంగతేమోకాని మధ్యలో ఆగిపోయిన ఒక గది ఇళ్ల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రారంభించి ఉత్పత్తి అయ్యే సమయంలో అధికారంలోంచి దిగిపోయందని, ఇప్పుడు టిఆర్‌ఎస్ ఆ ఉత్పత్తులను చూపించి ఆ ఫలితాలు తానే సాధించానని చెప్పుకుంటోందన్నారు. పైసా ఖర్చులేని జిల్లాల ఏర్పాటు, నీళ్లులేని కాలువలను తవ్వడం, తవ్విన కాలువలకు నీళ్లు ఇవ్వకపోవడం టిఆర్‌ఎస్ పార్టీ గొప్పతనమన్నారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్ నాయకులు ఎవరికో పుట్టిన బిడ్డలను పక్కన పెట్టుకుని తమ బిడ్డలని చెప్పుకుంటున్నారని, ఇది ఆశ్చర్యంగా ఉందన్నారు. సాగర్ నియోజకవర్గంలో కార్యకర్తలు ధైర్యంగా ఉండి అనైతిక రాజకీయాలను ముందుకు నడవనియ్యకుండా చూసుకోవాలని లేకుంటే రాజకీయ వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న సిఎల్‌పి నేత జానారెడ్డి