ఆంధ్రప్రదేశ్‌

రాజధాని రైతులకు నేటినుంచి ప్లాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు శనివారం నుంచి ప్లాట్లు కేటాయించనున్నారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఈనెల 20వ తేదీనే ముఖ్యమంత్రి చంద్రబాబు నేలపాడు గ్రామంలో రైతులకు ప్లాట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. నేలపాడు గ్రామంలో 1147 నివాస, 769 వాణిజ్య ప్లాట్లు, 55 విల్లాలకు సిఆర్‌డిఎ అనుమతిచ్చింది. గ్రామంలో మొత్తం విస్తీర్ణం 1418.26 ఎకరాలు కాగా 9.14 అగ్రిమెంట్లు పూర్తిచేసిన 824 మంది రైతులకు సంబంధించిన 1269.12 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటున్న 18 మంది రైతులకు సంబంధించి 17.23 ఎకరాలు, శివాయి జమ భూములకు సంబంధించిన 65 మంది రైతులకు చెందిన 26.1 ఎకరాలు, అభ్యంతరకర ప్రభుత్వ భూమి ఆక్రమణదారులు 28 మంది నుంచి 12.14 ఎకరాలు ప్రభుత్వం సమీకరించింది. రాజధాని అవసరాలకు ఈ గ్రామంలో ఇంకా 30.91 ఎకరాలు సేకరణ జరపాలని నిర్ణయించింది. ప్లాట్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేలపాడులో భూమి చదును చేయించి ప్లాట్లు గుర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించిన అనంతరం వచ్చే నెల 10వ తేదీలోగా రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులందరికీ భూ పంపిణీ చేస్తారు. ఇలా ఉండగా రాజధాని ప్రాంతానికి ప్రత్యేకించి ఏర్పాటు కానున్న యాక్సిస్ రోడ్డుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 21.6 కిలోమీటర్ల మేర ఉండవల్లి నుంచి ఉద్దండరాయునిపాలెం వరకు ఏర్పాటు కానున్న ఈ రోడ్డులో మూడు ఫ్లై ఓవర్లు, స్ప్రింగ్ వంతెనను నిర్మిస్తారు. రాజధాని సదుపాయాలు, రైతులకు ప్లాట్లతో పాటు అమరావతి ప్రాంతంలోనే అన్న క్యాంటీన్‌లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం లింగాయపాలెం కల్పన ఫ్యాబ్రిక్స్, వెలగపూడిలో అన్న క్యాంటీన్లను సిఎం ప్రారంభించనున్నారు.

నేలపాడులో రైతులకు ప్లాట్లు పంపిణీ
చేసేందుకు నేలను చదును చేస్తున్న దృశ్యం