రాష్ట్రీయం

కాల్‌మనీ ప్రకంపనలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 15:కాల్‌మనీ కేసులో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటినుంచీ ఈ కేసులో నిందితులపై ఉక్కుపాదం మోపుతున్న విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అకస్మాత్తుగా 15 రోజులు సెలవుపై వెడుతున్నారు. ఇందులో రాజకీయమేమీ లేదని డిజిపి స్వయంగా ప్రకటించినా, ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేకే సిపి సెలవుపై వెడుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు కాల్‌మనీ వ్యవహారాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా విజయవాడలో టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు నాగేశ్వరరావు, మహిళా కార్పొరేటర్ భర్త కొండలుతోపాటు 60మందిని అదుపులోకి తీసుకున్నారు.
కాల్‌మనీ ప్రకంపనలు గుంటూరు, కడప, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకు కూడా పాకాయి. కడపలో సుమారు వందమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో వడ్డీ వ్యాపారులు, రాజకీయ ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరిపారు.
బయటకు వస్తున్న బాధితులు
ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. రౌడీయిజం, ప్రైవేట్ పంచాయతీలకు ప్రసిద్ధిగాంచిన విజయవాడ నగరంలో తొలిసారిగా గృహిణులు, అభం శుభం తెలియని విద్యార్థినులు, యువతులను కూడా ఈ కాల్‌మనీ వ్యవహారంలోకి లాగేయడంతో రాష్టవ్య్రాప్తంగా ప్రజలు కోపోద్రిక్తులవుతున్నారు. ముఖ్యమంత్రి కూడా కాల్‌మనీ సొమ్మును ఎవరూ తిరిగి చెల్లించవద్దని భరోసా ఇవ్వటంతో రాష్టవ్య్రాప్తంగా బాధితులు పెద్ద సంఖ్యలో పోలీసులను ఆశ్రయించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్టవ్య్రాప్తంగా కాల్‌మనీ వడ్డీ వ్యాపారులకు సంబంధించిన 300 పైగా ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు జరిగాయి. ఈ సందర్భంగా 938 ప్రామిసరీ నోట్లు, 100 పైగా ఖాళీ సంతకాలతో కూడిన చెక్‌బుక్‌లు, వందలాది ఆస్తి తాకట్టు పత్రాలు, 40 లక్షల రూపాయలు పైగా నగదు లభించినట్లు తెల్సింది. అసలు ఈ కాల్‌మనీ మూలాలు నెల రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలోనే వెలుగు చూసినట్టు తాజాగా తెలుస్తోంది. సెల్ఫీలో మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న కృపామణి మృతికి కూడా కాల్‌మనీ వ్యవహారమే కారణమన్న దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సెలవుపై కమిషనర్ సవాంగ్
కాల్‌మనీ కేసులో మొదటినుంచీ చురుగ్గా వ్యవహరిస్తున్న నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ 17నుంచి సెలవుపై వెడుతున్నట్టు తెలియడంతో బాధితులు ఒక్కసారిగా హతాశులయ్యారు. ఎంతటివారినైనా వదిలేది లేదని, నిర్మొహమాటంగా విచారణ జరిపి మరికొన్ని శక్తులను కటకటాల వెనక్కి నెడతామని చెప్పిన సవాంగ్, కొన్ని గంటలైనా కాకముందే సెలవుపై వెడుతున్నట్టు సమాచారం రావడంతో దీని వెనుక కుట్ర ఉందని అటు విపక్షాలు, ఇటు కాల్‌మనీ కేసులో బాధితులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే సవాంగ్ సెలవుపై వెళ్లడానికి రాజకీయ ఒత్తిళ్లు కారణం కాదని, ఆయన గత నెల 24నే సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నారని స్వయంగా డిజిపి రాముడు చెప్పారు. అయితే ఇంత పెద్ద కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో సెలవుపై పంపడమేమిటనీ, సెలవు రద్దు చేయవచ్చు కదాని విపక్షాలు నిలదీస్తున్నాయి. సవాంగ్ స్థానంలో అదనపు డిజి సురేంద్ర బాబును ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. ఇదిలాఉండగా కాల్‌మనీ వ్యాపారం పోలీసు శాఖ పరిధిలోనే లేదని డిజిపి జెవి రాముడు చెబుతుండటం గమనార్హం. అయితే అధిక వడ్డీ వసూలుతో పాటు సొమ్ము వసూలు కోసం వేధిస్తే పోలీస్ శాఖ చూస్తూ ఊరుకోదన్నారు.

చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న డిజిపి