తెలంగాణ

దమ్ముంటే ‘ఏటిగడ్డ’కు రా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 24: సాధారణ ఎమ్మెల్యే స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు పదవులను అధిరోహించడానికి కెసిఆర్‌కు మెదక్ జిల్లా ప్రజలు అండగా నిలిచారని, అధికార దురహంకారంతో అండగా నిలిచిన ప్రజల పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సి.దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 65వ నంబరు జాతీయ రహదారిపై పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సుమారు అరగంట పాటు కాంగ్రెస్ శ్రేణులు బైఠాయించి రోడ్డు దిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపై టైర్లు వేసి దగ్ధం చేసారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేరకు స్తంభించిపోయాయి. రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారుల మధ్య పెనుగులాట చోటుచేసుకోగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రి హరీష్‌రావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. అనంతరం సొంత పూచికత్తుపై నాయకులను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మెదక్ జిల్లాకు చెందిన అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వడంవల్లనే రాష్ట్ర సాధన సాధ్యమైందన్న కనీస అభిమానాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. భూ నిర్వాసితులు ఆందోళనలు నిర్వహిస్తున్నా సిఎం కనీసం స్పందించకపోగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న హరీశ్‌రావులో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే మంత్రి హరీష్‌రావు తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి వచ్చి రైతులతో గ్రామ సభ నిర్వహించాలని సవాల్ చేసారు. బంగారు తెలంగాణ పేరుతో అమాయక రైతుల నుంచి భూములు లాక్కుంటూ దళారీ ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు.
2013లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందించాలని, 123 జివోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ప్రాణహిత-చెవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేసారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి న్యాయం చేకూరే వరకు పోరాటం చేస్తుందన్నారు. రోడ్డు దిగ్బంధంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి), నాయకులు శ్రావణ్‌కుమార్‌రెడ్డి, జడ్పీటిసి సభ్యులు ప్రభాకర్, సంగమేశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజి అనంత కిషన్ తదితరులు పాల్గొన్నారు.