తెలంగాణ

ప్రాజెక్టులు పూర్తయతే ప్రతిపక్షాలు గల్లంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 24: ప్రతిపక్షాలు తమ ప్రభుత్వం ఏ మంచి పనులు చేసినా అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయని, ప్రాజెక్టులు పూర్తయితే రాజకీయంగా వారికి పుట్టగతులుండవనే అడ్డుపుల్లలు వేస్తున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. శుక్రవారం నల్లగొండ జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్‌పై విపక్షాల ప్రచారంలో పసలేదంటు కొట్టిపారేశారు. నాలుగు జిల్లాల రైతులకు 10 లక్షల ఎకరాలకు సాగునీరందించే మల్లన్న సాగర్‌ను కట్టీ తీరుతామన్నారు. ముంపునకు గురయ్యే ఎనిమిది గ్రామాల రైతులకు మెరుగైన పరిహారం చెల్లించి ఒప్పిస్తామన్నారు. మల్లన్న సాగర్‌ను అడ్డుకుంటే పట్టిసీమ ద్వారా సీమాంధ్రకే లబ్ధి చెందుతుందని, తెలంగాణ నష్టపోతుందన్నారు. మోత్కుపల్లి, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్, పొన్నాల, షబ్బీర్ చంద్రబాబుకు పరోక్షంగా సహకరిస్తూ ఇక్కడి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారన్నారు. మల్లన్న సాగర్‌ను వద్దనే అర్హత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదన్నారు. ఆంధ్రకు నీరు పారించే పులిచింతల ప్రాజెక్టు కోసం ఉత్తమ్ నియోజకవర్గంలో 14 గ్రామాలు, 13 వేల ఎకరాలు ముంచినప్పుడు ఉత్తమ్ ఎందుకు వ్యతిరేకించలేదంటూ నిలదీశారు. 2013 జీవో మేరకు పులిచింతల నిర్వాసితులకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారం చెల్లించగా తాము మల్లన్న నిర్వాసితులకు ఎకరాకు 123 జీవో ద్వారా 7 లక్షల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. పులిచింతల కింద ఇళ్లు కోల్పోయిన వారికి ఐఏవై ఇళ్లు ఇస్తే తాము మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఐదున్నర లక్షల డబుల్ బెడ్ రూం కట్టిస్తున్నామన్నారు.
వాస్తవాలు ఇలా ఉంటే 2013 జీవోతో పరిహారం చెల్లించాలంటు నిర్వాసితులను రెచ్చగొడుతూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్, టిడిపి రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కరీంనగర్ జిల్లా తోటపల్లి ప్రాజెక్టు కింద 49 వేల ఎకరాలు సాగులోకి రానుండగా ఈ ప్రాజెక్టు కింద మూడు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ఇక్కడ రెండు వాగుల కింద అక్విడెక్ట్‌లు కడితే ముంపు తప్పించవచ్చని ఇంజనీర్లు చెప్పగా ప్రాజెక్టునే కట్టాలని గ్రామాలు ముంచాలని ఆందోళనలు చేసిన విపక్షాలు మల్లన్న సాగర్‌ను వ్యతిరేకిస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ సమాజం టిఆర్‌ఎస్ ప్రభుత్వం వెంట ఉందని సిఎం కెసిఆర్ కోటి ఎకరాలకు సాగునీటి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. అరవై ఏళ్ల్లలో కోటి 2 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంలు కడితే తమ ప్రభుత్వం రెండేళ్లలో కోటి 5 లక్షల మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మాణం చేపట్టిందన్నారు. మంత్రి జి.జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు ఏమీ చేయని కాంగ్రెస్, టిడిపి ఇప్పుడు ఈ ప్రాంతంలోని రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే మల్లన్న సాగర్‌ను అడ్డుకుంటున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్ర పాలకుల కుట్రలు కొనసాగుతున్నాయన్నారు. విద్యుత్ రంగంలో తెలంగాణకు ఇవ్వాల్సిన వాటాను ఆంధ్ర ఎగవేసినా కోతల్లేని విద్యుత్‌ను ప్రజలకు అందిస్తున్నామన్నారు. 2019లోగా తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో మిగులు సాధిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని టిడిపి నేతలు ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దీక్షలు చేస్తున్నారని వారిని తెలంగాణ ప్రజలు తరిమికొడుతారన్నారు. ఈ సమావేశంలో ఎంపి బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు.