తెలంగాణ

రైతులతో భూమి దున్నించిన విమలక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 24: ఆరు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కోడమేమిటని, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని, బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క ప్రశ్నించారు. శుక్రవారం మండలంలోని పుల్‌మద్ది అటవీ ప్రాంతంలో వివాదాస్పద భూములను ఆమె రైతులచే దున్నించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని రైతులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై రైతులు మండిపడ్డారు. ఇక్కడ 60 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఏడాదికాలంగా పంటలు సాగు చేసేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు అడ్డుకోవడం సరైందని కాదని ఆందోళన వ్యక్తం చేశారు.
మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. విమలక్క మధ్యలో కలుగజేసుకుని అటవీ సంపదను కొందరు అక్రమార్కులు కాజేస్తున్నా పట్టించుకోని అధికారులు రైతుల భూములపై పడి వారిని వ్యవసాయానికి అడ్డుపడటమేమిటని ప్రశ్నించారు. పుల్‌మద్ది భూముల విషయంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య చినికిచినికి గాలివానగా మారుతోందని తెలుసుకున్న జిల్లా అదనపు అటవీశాఖ అధికారి రేఖా భాను, ఎఫ్‌ఆర్‌వో నర్సింగ్‌రావులు అక్కడకు చేరుకున్నారు. విమలక్క, రైతులు ఆ ఇద్దరు అధికారులకు విషయమంతా చెప్పారు. రెండు రోజుల్లో సమ్యను పరిష్కరిస్తామని పంటలు సాగు చేయవద్దని అధికారులు చెప్పడంతో రైతులు శాంతించారు. మంత్రికి విమలక్క ఫోన్
ఇదిలా ఉండగా విమలక్క రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్నకు ఫోన్ చేసి పుల్‌మద్ది భూ వివాదం వివరించారు. గతంలో సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన వర్షిణి రెవిన్యూ అధికారుల పొరపాటును అంగీకరించారని మంత్రి దృష్టికి తెచ్చారు. ఆమె బదిలీతో సమస్య మొదటికొచ్చిందని చెప్పారు. అక్కడ ఉన్న అటవీశాఖ అధికారితో మంత్రితో విమలక్క మాట్లాడించారు. శనివారం రైతులు, అటవీశాఖ అధికారులు తన వద్దకు రావాలని మంత్రి సూచించినట్లు విమలక్క వెల్లడించారు.