తెలంగాణ

ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: రాష్ట్రంలో సినిమా పైరసీని అరికట్టేందుకు తెలంగాణ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ (టిఐపిసియు)ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. శుక్రవారం ఇక్కడ సినిమా పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టిఐపిసియును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పైరసీకి పాల్పడుతున్నట్లు రుజువైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పైరసీ వల్ల అనేక మంది ఉపాధి కోల్పోతున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన టిఐపిసియు సిఐడి ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు.
రాష్ట్రంలో నీలి చిత్రాల వెబ్‌సైట్లను నిలువరించామన్నారు. సినిమా పైరసీని అరికట్టేందుకు ప్రత్యేక బృందం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, సిటీ పోలీసు కమిషనర్ పి మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్, సిఐడి ఐజి సౌమ్య మిశ్రా, డిఐజి రవి వర్మ, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, ఉడ్తా పంజాబ్ సినిమా డైరెక్టర్ అభిషేక్ చౌబే తదితరులు హాజరయ్యారు.

శుక్రవారం హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టిఐపిసియును
ప్రారంభిస్తున్న మంత్రి కెటిఆర్, నిర్మాత సురేష్‌బాబు