రాష్ట్రీయం

వర్శిటీలపై మీ పెత్తనమేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూన్ 25: వర్శిటీల స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం మంచిపద్ధతి కాదని తెలంగాణ జేఏసీ చైర్మెన్ కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాలలో వర్శిటీ స్వయంప్రతిపత్తిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఇటీవల తెరాస ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసి యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టడంపై మండిపడ్డారు. జీవో నెంబర్ 78ను తీసుకువచ్చి యూనివర్సిటీ పోస్టులను భర్తీ చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవోనెంబర్ 78ను రూపొందించిన వారికి సరైన అవగాహన లేదని ఆరోపించారు. వెంటనే జీవో నెంబర్ 78ను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వర్శిటీల స్వేచ్ఛ హరించడానికే జీవో 78ను తీసుకువచ్చారన్నారు. చట్టంలో లేని జీవోలను తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. జీవో నెంబర్ 78ను రద్దు చేయాలని విద్యార్థులు ఉద్యమించాలని, వారికి సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. సమావేశాలు పెట్టుకోవడానికి ఆంక్షలు విధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా జీవో నెంబర్ 78ను రద్దు చేయిస్తామని ఆయన తెలిపారు. ఈ రౌండ్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, జానయ్య, ప్రభాకర్‌రెడ్డి, హన్మంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ
అంతకుముందు రౌండ్ సమావేశం రాజేంద్రనగర్‌లోని హార్టికల్చర్ కళాశాలలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కాని హార్టికల్చర్ కళాశాలకు రాజేంద్రనగర్ పోలీసులు పెద్దఎత్తున చేరుకొని సమావేశం ఏర్పాటు చేయడానికి అనుమతి లేదంటూ సమావేశ మందిరానికి తాళం వేసి విద్యార్థులను వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. సమావేశ ప్రాంగణానికి పక్కనే ఉన్న అగ్రికల్చర్, వెటర్నరీ విద్యార్థులు హార్టికల్చర్ కళాశాలకు రావడానికి అనుమతి లేదంటూ పోలీసులు విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారు. వెంటనే ఈ వేదికను మార్చండి అంటూ జేఏసీ నిర్వాహాకులకు పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ప్రొఫెసర్ హరగోపాల్ విద్యార్థుల తరపున పోలీసులతో మాట్లాడి వేదికను పక్కనే ఉన్న వెటర్నరీ కళాశాలకు మార్చడంతో వివాదం సద్దుమణిగింది.