రాష్ట్రీయం

దోషుల పనిపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రలో విజయవాడ సహా పలు నగరాల్లో విస్తరించిన కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై నిష్పాక్షికంగా న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌ను కోరారు. మంగళవారం వైకాపా ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. అనంతరం మీడియా మాట్లాడుతూ కాల్‌మనీ రాకెట్‌లో చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్సీలు పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. సిఎం చంద్రబాబు విజయవాడ నుంచి పరిపాలన కొనసాగిస్తూ ఇసుక, మద్యం, కాల్‌మనీ, భూ మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం సిగ్గుతో తలదించుకునేలా తెదేపా ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. మహిళల మాన ప్రాణాలతో ఆటలాడుతోన్న కాల్‌మనీ రాకెట్‌లోని నిందితులతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై దౌర్జన్యం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కొల్లేరులో అటవీ నిబంధనలు తుంగలోతొక్కి రోడ్డు వేయించారన్నారు. అంగన్‌వాడీలను నోటికి వచ్చినట్లు తిట్టారన్నారు. కాల్‌మనీ రాకెట్‌లో ఎమ్మెల్సీ, ఆయన సోదరుడు ఉన్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. విజయవాడ, గుంటూరు నగరాలను మాఫియా నగరాలుగా మార్చేశారన్నారు. 17నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తామన్నారు. వైకాపా ఎమ్మెల్యే జి ఈశ్వరి గిరిజనులు మాట్లాడే సహజ ధోరణిలో విల్లంబులతో చంద్రబాబు పనిపడుతామంటే, హత్యాయత్నం కేసు నమోదు చేయడమేంటన్నారు. 2009 అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని పట్టుకుని అసలు నువ్వు అసెంబ్లీకి వస్తే కదా అన్నారని, ఆ తర్వాత వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని, ఈ దిశగా సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయలేదన్నారు. రాజశేఖర రెడ్డి తనను వ్యతిరేకించినందుకే పావురాల గుట్టలో పావురమయ్యారని చంద్రబాబు చాలాసార్లు మాట్లాడారని, దీనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదన్నారు. గిరిజన మహిళ అని చూడకుండా ఈశ్వరిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం దారుణమన్నారు. తిరుపతి విమానాశ్రయంలోనూ తమ పార్టీకి చెందిన ఎంపి, ఎమ్మెల్యేలు ఎయిర్‌పోర్టు మేనేజర్‌పై దౌర్జన్యం చేశారన్న అభియోగంతో కేసు నమోదు చేయించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.