రాష్ట్రీయం

త్వరలో రాష్టమ్రంతటా అన్న క్యాంటీన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 25: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికీ ఆహార భద్రతలో భాగంగా అన్న క్యాంటిన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. హరేకృష్ణ సమాజం సహకారంతో వెలగపూడిలో అన్న క్యాంటిన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రారంభించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మూడు క్యాంటిన్లను త్వరలో ఏర్పాటు చేస్తామని, ఆపై రాష్టమ్రంతటా విస్తరింపజేస్తామన్నారు. ఎన్‌టిఆర్ అన్న క్యాంటిన్ గురించి సిఎం వివరిస్తూ ఒక రూపాయికి ఇడ్లీ, టమాటాబాత్, పొంగలి, పులిహోర, సాంబారు రైస్, వెజ్ రైస్‌లను 5 రూపాయల చొప్పున, 3 రూపాయలకు పెరుగన్నం అందిస్తారన్నారు. అన్న క్యాంటిన్‌లు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం 11.30 నుంచి 2 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, నారాయణ, పరిటాల సునీత, కలెక్టర్ కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు.

చిత్రం వెలగపూడిలో అన్న క్యాంటిన్‌ను ప్రారంభించిన అనంతరం
మంత్రులతో కలిసి భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు