రాష్ట్రీయం

పేషీలో పేచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: రాష్ట్భ్రావృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు అహర్నిశలు కష్టపడుతుంటే, మరోవైపు సీఎం పేషీ అధికారుల తీరుతో బాబు కష్టం వృథా అవుతోందన్న ఆవేదన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లలో వ్యక్తమవుతోంది. కొంతమంది అధికారులు బాబును తప్పుదోవపట్టిస్తున్నారని, సీఎంఓలో ఉన్నామన్న ధీమాతో లెక్కలేకుండా వ్యవహరిస్తున్నారని మంత్రులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపధ్యంలో సిఎంఓ ప్రక్షాళన చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సీఎంఓకు, సీఎస్‌కు మధ్య కూడా దూరం పెరుగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గ్రూప్-1 అధికారులను ఐఎఎస్ పోస్టులకు సిఫార్సు చేసే ప్రమోషన్ కమిటీ జాబితాలో సీసీఎల్‌ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరి పునేఠా పేరు ఉండాల్సి ఉండగా, ఆయన బదులు పరీడా పేరును సీఎస్ ఠక్కర్ కమిటీ జాబితాలో చేర్చడం వివాదానికి దారితీసింది. సీఎంఓలో కీలక అధికారి ఒకరు పునేఠా పక్షాన కాబోయే సీఎస్‌గా లాబీ చేస్తున్న విషయం తెలియడంతో, ఠక్కర్ ఆయనకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ అధికారవర్గాల్లో జరుగుతోంది. పునేఠా సీఎస్ కాకుండా ఇప్పటినుంచే ఐఏఎస్‌లో ఒక వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టిందన్న ప్రచారం జరుగుతోంది.
సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చందర్, మరో కార్యదర్శి సాయిప్రసాద్, అదనపు కార్యదర్శి ప్రద్యుమ్న పనితీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లలో తీవ్రస్థాయి అసంతృప్తి నెలకొంది. బాబు సానుకూలంగా స్పందించినా వీరు ఆ మేరకు వ్యవహరించడం లేదని, సతీష్‌చందర్ తమ ఫోన్లకూ స్పందించడం లేదని పలువురు ఎంపిలు ఒకదశలో సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవగా, సహచర ఎంపీ వారించడంతో ఆ ప్రయత్నం విరమించుకోవలసి వచ్చింది. ప్రజల ఒత్తిళ్లతోపాటు, తమను గెలిపించిన వారికి సాయం చేయడం తమ ధర్మమని, కానీ అందుకు సీఎంఓ అధికారులెవరూ సహకరించడం లేదని, పైగా తమ మీదనే సీఎంకు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని మంత్రులు సీఎంఓపై ఆగ్రహంతో ఉన్నారు. విశాఖ, అనంతపురం, గుంటూరుకు చెందిన మంత్రులు ఇప్పటికే కొందరు అధికారులపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సాయిప్రసాద్ పనితీరుపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. సరైన సమయం ఇవ్వడం లేదని, తామంటే లెక్కలేనట్లు వ్యవహరిస్తున్నారని మంత్రులు, నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ‘సీఎంఓలో ఏం జరుగుతోందో, ఎవరు ఎలా పనిచేస్తున్నారో బయట అందరికీ తెలిసిపోయింది. మేం కీలక విషయాలపై మాట్లాడాలని ఫైళ్లు పట్టుకుని, దానిపై సబ్జెక్టు ప్రిపేరయి వెళితే, అధికారులు దానిని పక్కదారిపట్టించి, ఒక అంశంపైనే సీఎంతో మాట్లాడి పంపించేస్తున్నారు. సీఎంఓ నిర్ణయాలు కొన్ని పత్రికల్లో చూసి తెలుసుకోవలసి వస్తోంది’ అని ఓ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో ప్రైవేటు బిఇడి, డిఎడ్ కాలేజీల వ్యవహారంలో ప్రద్యుమ్న వ్యవహారశైలిపై మంత్రి గంటా గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశాయితిప్పారెడ్డి-నరేన్‌కుమార్‌రెడ్డికి సమానంగా ఓట్లు వచ్చినా మంత్రి ఒత్తిళ్ల మేరకు తిప్పారెడ్డి గెలిచినట్లు ప్రకటించారని, మంత్రులు గుర్తు చేస్తున్నారు. దానిని హైకోర్టు కూడా కొట్టివేసి, నరేన్‌కుమార్‌రెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంలో అప్పటి కలెక్టర్ నిర్ణయాన్ని తప్పుపడితే, అదే అధికారిని తీసుకువచ్చి సీఎంఓలో పెట్టడం ఆశ్చర్యంగా ఉందని పలువురు మంత్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కార్యదర్శి హోదా రాకపోయినా కార్యదర్శిగా వ్యవహరించడం నిబంధనలకు వ్యతిరేకమంటున్నారు.
తాము పదేళ్లు ప్రతిపక్షంగా ఉంటూ పోరాడిన సమయంలో ఇప్పుడున్న అధికారులెవరూ తమకు సాయం చేయలేదని, వారికి తమతో పరిచయం కూడా లేదని చెబుతున్నారు. వైఎస్ హయాంలో ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన జన్నత్‌హుస్సేన్, సుబ్రమణ్యం, ప్రభాకర్‌రెడ్డి, భాను వంటి అధికారుల వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంతో గౌరవం ఉండేదని గుర్తు చేస్తున్నారు. సీఎంఓ అంటే పార్టీ విధానాలకు అనుగుణంగా ఉండాలే తప్ప, ప్రభుత్వపరంగా ఉంటే ఆ ప్రభుత్వానికి ప్రజాసర్కారు ముద్ర రాదని స్పష్టం చేస్తున్నారు.