రాష్ట్రీయం

పిఎస్‌ఎల్‌వి-సి 29 ప్రయోగం నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 15: పోలార్ శాటిలైట్ వాహక నౌక (పిఎస్‌ఎల్‌వి) ద్వారా ఒకేసారి ఆరు సింగపూర్ దేశానికి చెందిన విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురిపెట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌థావన్ స్పేస్ సెంటర్‌నుండి బుధవారం సాయంత్రం 6 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 29 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 7గంటలకు ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ప్రయోగానికి 59గంటలు ముందు ప్రారంభమైన కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి బుధవారం సాయంత్రం 6గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగరనుంది. స్ట్ఫ్రాన్ బూస్టర్ మోటార్ల లేకుండా ప్రయోగించే ఈ రాకెట్ ద్వారా సింగపూర్‌దేశానికి చెందిన 400కిలోల బరువుగల ప్రధాన ఉపగ్రహం టెలిమోస్‌తో పాటు మరో 5 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి భూ పరిశీలన నిమిత్తం సింగపూర్ దేశం షార్ కేంద్రం నుండి ఉపగ్రహాలను పంపేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్య రంగానికి చెందింది. ఇది విజయవంతమైతే ఇస్రోకు వాణిజ్య పరంగా బాగా ఆదాయం చేకూరనుంది. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లోని అన్ని దశలకు ఇంధనంతో పాటు హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను విజయవంతంగా నింపి శాస్తవ్రేత్తలు రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేశారు. నాలుగు దశల్లో జరిగే ప్రయోగం రాకెట్ మొదటి దశలో 138టన్నుల ఘన ఇంధనం, రెండో దశలో 42టన్నుల ద్రవ ఇంధనం, మూడోదశలో 7.6టన్నుల ఘన ఇంధనం, నాలుగో దశలో 2.5టన్నుల ద్రవ ఇంధనం ఉంటుంది. 44.4మీటర్ల ఎత్తుగల పిఎస్‌ఎల్‌వి రాకెట్ 230టన్నుల బరువుకలిగి ఉంటుంది. ఇస్రో చైర్మన్ ఎ ఎస్.కిరణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం షార్‌కు చేరుకొని షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్, పిఎస్‌ఎల్‌వి ప్రాజెక్టు డైరెక్టర్ శివన్‌తో కలసి ప్రయోగ వేదిక వద్దకు చేరుకొని కౌంట్‌డౌన్ పనితీరును పరిశీలించారు. అనంతరం శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగ ఏర్పాట్ల పై సమీక్షిస్తున్నారు. ప్రయోగం విజయవంతం కావాలని ప్రాజెక్టు డైరెక్టర్ శివన్, శాస్తవ్రేత్తలు సోమవారం రాత్రి సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో చివరిసారిగా శాస్తవ్రేత్తలు రాకెట్‌కు గ్లోబల్ పరీక్షలు నిర్వహించి ప్రయోగానికి 6గంటల ముందు రాకెట్‌కు విద్యుత్తు సరఫరా ఇచ్చి అన్ని వ్యవస్థల పనితీరును గమనించి ఏవైన చిన్నపాటి లోపాలుంటే సరిచేసి చివరి 12నిమిషాల వ్యవధిలో మిషన్ కంట్రోలర్ సెంటర్‌లో ఉన్న 12సూపర్ కంప్యూటర్లకు అనుసంధానం చేసి కౌంట్‌డౌన్ 0మైనస్‌కు చేరిన వెంటనే కంప్యూటర్ల ద్వారా రాకెట్‌ను నింగిలోకి పంపిస్తారు.
ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్య రంగానికి చెందింది. పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో ఇది 32వ ప్రయోగం కావడం విశేషం. 1999లో మొదటి సారిగా ఇస్రో షార్ కేంద్రం నుండి మన రాకెట్ల ద్వారా విదేశీ ఉపగ్రహాలను పంపేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 20దేశాల నుండి మొత్తం 51 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఉన్నారు. వివిధ వాహక నౌకల ద్వారా ఇప్పటి షార్ నుండి ఇస్రో మొత్తం 84 ఉపగ్రహాలను పంపగా ఇందులో విదేశీ 51కాగ మన దేశానికి చెందినవి 20 ఉపగ్రహాలు కావడం వివేషం. ఈ ప్రయోగంతో విదేశీ ఉపగ్రహాల సంఖ్య 57కు చేరుతోంది.

చిత్రం.. ఉపగ్రహాలను అమర్చిన
రాకెట్ చివరిభాగం