రాష్ట్రీయం

ఏ లోటూ రానివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 25: ‘సచివాలయ ఉద్యోగులకు సకల వసతులు కల్పిస్తున్నాం.. తరలింపులో ఏవైనా తప్పులుంటే మన్నించాలి.. ఏ లోటూ రానివ్వం’ అని ఏపి సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం వెలగపూడి సచివాలయ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికి సచివాలయ పనులు ప్రారంభించి 120 రోజులు మాత్రమే పూర్తయ్యాయని, ఇంత స్వల్ప వ్యవధిలో ప్రపంచంలో ఏ నిర్మాణాలూ జరగలేదన్నారు. సచివాలయానికి రాకపోకలకు అనువైన రోడ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నామని, కార్యాలయాల్లో కూడా ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌తో అనుబంధం పెనవేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానికి రాక తప్పదన్నారు. పట్టుదలతో ఉద్యోగులు పనిచేయాలని, రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా వ్యవహరించాలని హితవుపలికారు. ఉద్యోగుల్లో కూడా రాష్ట్రం కోసం వస్తున్నామనే భావన నెలకొందని, తరలింపునకు సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగిని సైకిల్‌పై హైదరాబాద్ నుంచి అమరావతి తరలిరావడం పట్టుదలకు స్ఫూర్తిగా అభివర్ణించారు. వారానికి ఐదు రోజుల పనిదినాలతో పాటు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశామని, ఉద్యోగుల సౌలభ్యం కోసం కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఎసి, కంప్యూటర్లతో పాటు అధునాతన వసతులను సచివాలయంలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
సచివాలయ ఉద్యోగుల తరలింపునకు సంబంధించి చంద్రబాబు కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటించారు. ఈనెల 29కి 5వ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్, వచ్చే నెల 6వ తేదీకి ఫస్ట్ఫో్లర్ సిద్ధమవుతాయని, ఇక్కడ్నుంచే విధుల నిర్వహణ ప్రారంభమవుతుందని అన్నారు. మిగిలిన 1, 2, 3, 4 బ్లాకుల గ్రౌండ్‌ఫ్లోర్లు వచ్చే నెల 15, ఫస్ట్ఫో్లర్లు 21వ తేదీ నాటికి కాంట్రాక్టు సంస్థలు అప్పగిస్తాయని వివరించారు. జూలై నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పాలనా యంత్రాంగం సచివాలయంలో కేంద్రీకృతమవుతుందని వివరించారు. కొత్త రాష్ట్రంలో సమస్యలు, ఇబ్బందులు ఉంటాయని, వాటిని అధిగమించి అభివృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు.