రాష్ట్రీయం

టిడిపి పాలన వల్లే తెలంగాణ ఎడారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: పదిహేడు ఏళ్ల టిడిపి దుర్మార్గ పాలన వల్లనే తెలంగాణ ఎడారిగా మారిందని, ఇంకా తెలంగాణకు ద్రోహం చేయాలని ప్రయత్నిస్తున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆంధ్ర సిఎం చంద్రబాబు రచించిన కుతంత్రంలో టిటిడిపి నాయకులు పాత్ర దారులుగా మారారని విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు కోసం రేవంత్ దొంగ దీక్షలు చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులను ఆపే కుట్రకు తిరుపతిలో జరిగిన మహానాడు వేదికైందని విమర్శించారు. గోదావరి నదిలో పడిన ప్రతి నీటి చుక్క పోలవరం లేదా ధవళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆంధ్రకే దక్కాలని ఆంధ్ర పాలకుల కుట్రలో భాగంగానే రేవంత్‌రెడ్డి మల్లన్న సాగర్‌ను అడ్డుకోవాలని దీక్ష చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మించాలని దీక్షలు చేస్తారు కానీ ప్రాజెక్టులు కట్టవద్దని దీక్షలు చేయడం ఇక్కడే చూస్తున్నామని అన్నారు. కరవు వల్ల 15లక్షల మంది ప్రజలు వలస పోయిన పాలమూరు జిల్లాలో కరవు అలానే ఉండాలని, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులు మరింతగా పెరగాలని టిడిపి భావిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో నష్టపరిహారం గరిష్టంగా రెండు లక్షల రూపాయలు చెల్లించారని జివో 123 ప్రకారం ఎకరానికి 5.60 లక్షలతో పాటు కోరుకున్న చోట 5.40 లక్షల రూపాయల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే వెసులుబాటు కల్పించినట్టు చెప్పారు. ఆంధ్ర పాలకులకు ఏజెంట్లుగా పని చేస్తున్న నలుగురైదుగురు నాయకులు మాత్రమే టిడిపిలో మిగిలారని, వారే ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని కర్నె ప్రభాకర్ విమర్శించారు.