ఆంధ్రప్రదేశ్‌

మాటల్లో వేగం.. పనుల్లో పూజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 26: సోమవారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పాలన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటల మాట ఎలా ఉన్నా ఇక్కడి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడి పరిస్థితుల్ని లోతుగా గమనిస్తే ఇప్పట్లో పాలన మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. సచివాలయ ఉద్యోగులంతా 27నాటికల్లా అమరావతికి తరలి రావల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో సుమారు 70 నుంచి 80 కుటుంబాలు విజయవాడకు వచ్చేశాయి. అయితే, ఇంకా సచివాలయ భవనాలు మాత్రం సిద్ధం కాలేదు.
సచివాలయాన్ని ఐదు బ్లాకులుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఐదవ బ్లాక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో రోడ్లు, భవనాలు, రవాణా, ఐటి శాఖల మంత్రుల పేషీలు ఈనెల 29 నాటికి ఒక మోస్తరుగా సిద్ధం అవుతాయి. ఇక్కడే ఆయా శాఖలకు చెందిన కార్యదర్శుల చాంబర్లు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇదే బ్లాక్‌లోని మొదటి అంతస్థులో ఆర్ అండ్ బి, ట్రాన్స్‌పోర్ట్, విజిలెన్స్ కమిషనరేట్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ భవనాలు వచ్చే నెల ఆరవ తేదీకి సిద్ధమవుతాయని చెపుతున్నారు. ఇది కూడా అంతంతమాత్రంగానే అందబాటులోకి రానున్నాయి.
ఇదిలా ఉండగా తాత్కాలిక సచివాలయంలోని 1,2,3,4 బ్లాక్‌లు జూలై నెలాఖరుకు సిద్ధమవుతాయని చెపుతున్నారు. ఇందులోనే సిఎం పేషీ కూడా ఉంది. తాజా పరిస్థితులను పరిశీలిస్తే, జూలై నెలాఖరు నాటికి కూడా సచివాలయ భవన నిర్మాణం పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో వర్షాలు కురియడంతో నిర్మాణ పనులకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యమంత్రి పేషీ కూడా వచ్చే నెల 21 నాటికి సిద్ధమయ్యే పరిస్థితుల్లేవు. మిగిలిన బ్లాక్‌ల్లో ఇంటీరియల్ పనులు జూలై నెలాఖరుకు పూర్తయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. ప్రభుత్వం హడావుడి వలన పనుల్లో నాణ్యత కూడా తగ్గుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

చిత్రం... సచివాలయ భవనంలో పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌ఫొటో)