రాష్ట్రీయం

ఐక్యంగా ప్రతిఘటిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూల్ 26: కేంద్రంలో రెండేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, గిరిజనులు ఇతర శ్రామిక ప్రజల హక్కులపై దాడులను తీవ్రతరం చేసిందని, ఇదే సమయంలో తన మతతత్వ విధానాలతో దాడులు చేయిస్తూ శ్రామికులను చీల్చడానికి ప్రయత్నిస్తోందని ఈ దాడులను శ్రామిక ప్రజలు సమైక్యంగా తిప్పి కొట్టాలని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. కార్పొరేట్ల కోసం పాలకులు చట్టాలనూ మార్చేస్తున్నారని, ఈ నేపథ్యంలో కార్మికులు, శ్రామికులతోపాటు ప్రజలను కదిలించే నూతన ప్రత్యామ్నాయం అవసరముందని ఆయన స్పష్టం చేసారు. సిఐటియు నేతృత్యంలో నిర్వహించే ఉమ్మడి పోరాటాల ద్వారానే అది సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర 14వ మహాసభలను నగరంలోని బిఆర్‌టిఎస్ రోడ్టులో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్, వ్యాపార శక్తులకు అనుకూలంగా చట్టాలు చేస్తోందని, దీనివలన కార్మికవర్గాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆయన చెప్పారు. కోటీశ్వరులు, శతకోటీశ్వరులకు అండగా కేంద్రం ముందుకెళుతూ లక్షల కోట్ల రూపాయల రాయితీలు కల్పిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో అవినీతిని నిర్మూలిస్తామని హామీలిచ్చిన మోదీగాని, బిజెపి గాని అధికారంలోకొచ్చిన తరువాత దాని గురించి మాట్లాడకపోగా అవినీతిపరులు, పన్నుఎగవేతదారులకు రక్షణగా నిలుస్తోందన్నారు. కేంద్ర క్యాబినెట్లో ఒక మంత్రి, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కుంభకోణాలపై మోదీ నోరెత్తడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. బడ్జెట్ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన తెలిపారు. అత్యంత కీలకమైన రక్షణ రంగంలోనూ ఎఫ్‌డిఐలకు అనుమతిచ్చారని, ఇది భద్రతా వ్యవస్థకు పెనుముప్పును తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. కేంద్రం అనుసరిస్తున్న తీరును ప్రజలెవరూ అంగీకరించడం లేదని, గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన సమ్మె దీనికి నిదర్శమని, అటువంటిదే రానున్న సెప్టెంబర్లోనూ జరుగుతుందని చెప్పారు. టిడిపి, బిజెపి మధ్యకూడా తేడా లేదని బిజెపి అడుగుజాడల్లోనే టిడిపి నడుస్తోందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, శ్రామిక వ్యతిరేక విధానాలను సైతం టిడిపి వ్యతిరేకించడం లేదన్నారు. ఆందోళనలు పక్కదారి పట్టించేందుకు బిజెపి ఉద్దేశపూర్వకంగానే కార్మికులు, శ్రామికులు, రైతుల మధ్య వారిలో వారికి మతోన్మాద చిచ్చుపెడుతోందన్నారు. గత రెండేళ్లలో వెయ్యి మతోన్మాదదాడులు జరిగాయని ఆయన వివరించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సిఐటియు జాతీయ అధ్యక్షుడు ఎకె పద్మనాభన్, రాష్ట్ర మాజీ కార్యదర్శి బివి రాఘవులు, జాతీయ కార్యదర్శి కె హేమలత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌లు పాల్గొన్నారు. అంతకుముందు నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన సిఐటియు నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.