రాష్ట్రీయం

టిటిడి డోనర్ సెల్‌లో శ్రీవారి లడ్డూల కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, డిసెంబర్ 15 : టిటిడి చేపట్టిన వివిధ పథకాలకు విరాళాలు ఇచ్చే దాతలకు సంబంధించి ఏర్పాటుచేసిన డోనార్ సెల్ లో ఉచితంగా ఇచ్చే శ్రీవారి లడ్డూలను అక్కడ అటెండర్‌గా పని చేస్తున్న వెంకటరమణ అడ్డంగా దిగమింగాడు. మూడు నెలల వ్యవధిలోనే ఐదు లక్షల రూపాయలు విలువ చేసే 20 వేల లడ్డూలను బ్లాకులో విక్రయించినట్లు టిటిడి విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తేటతెల్లమయింది. డోనార్ సెల్‌లో దాతలకు ఏడాదికొకమారు మెమొంట్‌లు, శాలువలు, స్వామివారి చిత్రాలు ఉన్న వెండి డాలర్లు ఇస్తారు. పది లక్షల రూపాయలనుండి కోటి రూపాయలు విరాళాలు ఇచ్చిన దాతలకు స్వామి వారి బంగారు డాలర్లు ఇస్తారు. అయితే వీటిలో కూడా ఏమైన మోసాలు జరిగి ఉంటుందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి డోనార్ సెల్‌లో దాతలకు టిటిడి ఇస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాల్లో కఠినమైన నిబంధనలు ఉన్నా లడ్డూల కుంభకోణం జరగడంపై అధికారుల అలక్ష్యం బట్టబయలు అయింది. ఒక అటెండర్ స్థాయి ఉద్యోగికి ఇంత భారీ ఎత్తున బాధ్యతలతో కూడుకున్న పనులను అప్పగించడంపై కూడా విమర్శలు లేకపోలేదు.
ఇదిలా ఉండగా ఈ లడ్డూల కుంభకోణానికి పాల్పడిన అటెండర్ వెంకటరమణ (26) తండ్రి మరణంతో 2014లో టిటిడిలో ఉద్యోగం చేసే అవకాశం పొందాడు. ఈ నేపధ్యంలో గత రెండు సంవత్సరాలుగా ఏ మేరకు అవినీతికి పాల్పడి ఉంటాడన్నా అంశంపై ఈ అక్రమార్కున్ని పట్టుకున్న టిటిడి వి జి ఓ విమలాకుమారి మరింత లోతుగా దృష్టి సారించి విచారిస్తున్నారు.
వాస్తవానికి వెంకటరమణ అక్రమాలపై విషయం తెలుసుకొన్న టిటిడి ఇ ఓ సాంబశివరావు ఈ నెల 9న అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తంతు అంతా గోప్యంగా సాగింది. అయితే మంగళవారం ఈ అంశంపై టిటిడి వర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ జరగడంతో వ్యవహారం బయటకు పొక్కి మీడియా దృష్టికి వచ్చింది. ఈ యువకుడి వెనుక మరెవరైన పెద్దవాళ్ల హస్తం ఉన్నాయా అన్న అంశంపై కూడా విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి వెంకటరమణను విచారిస్తున్నారు. అయితే వెంకటరమణ కూడా విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తాను తప్పు చేసినట్లు లిఖిత పూర్యకంగా ఒప్పుకోవడం గమనార్హం. ఇదిలావుండగా టిటిడికి విరాళాలు ఇచ్చే దాతలకు కల్పించే సౌకర్యాలు, లడ్డూ, వస్త్ర ప్రసాదాలు అందజేసేందుకు తిరుమల టిబిసి వద్ద ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని డిప్యూటీ ఇఓ స్థాయి అధికారి పర్యవేక్షిస్తుంటారు. ఇందులో భాగంగా లక్ష రూపాయలు ఇచ్చే భక్తులకు 6 చిన్న లడ్డూలు, 5 నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చే వారికి 10 లడ్డూలు, 10 లక్షల రూపాయలుపైన ఇచ్చే దాతలకు 20 చిన్న లడ్డూలు, కోటి రూపాయలు ఆపైన ఇచ్చే దాతలకు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలను ఉచితంగా ఇస్తారు.
అంతే కాకుండా టిటిడి ముందుగా నిర్దేశించిన విరాళాలకు అనుగుణంగా ఇచ్చే స్వామి వారి బంగారు, వెండి డాలర్లు వస్త్రాలు అందిస్తారు. వాటిని డోనార్ సెల్‌లోనే అందిస్తారు. భక్తులకు ఇవ్వాల్సిన లడ్డూలను డోనార్ పేరుతో వోచర్ రాసుకొని డిప్యూటీ ఇఓ సంతకంతో శ్రీవారి ఆలయంలోని వగపడికి వెళతారు. అక్కడ పనిచేసే సిబ్బంది ఈ ఓచర్‌ను తీసుకొని ఆ రోజు వచ్చే దాతలను చెల్లించాల్సిన లడ్డూలను డోనార్ సెల్‌కు చెందిన అటెండర్‌కు ఇస్తారు. ఆ ఉద్యోగి ఈ లడ్డూలను డోనార్ సెల్‌కు తీసుకువెళ్లి దాతలకు అందజేస్తాడు. అలా చెల్లించే ప్రక్రియలోనే అటెండర్ తన హస్తలాఘవాన్ని ప్రదర్శించి, రాని డోనార్ల పేరుతోను లడ్డూలు ఇస్తారని తెలియని డోనార్ల పేరుతో వెంకటరమణ ఈ లడ్డూలను దిగమింగడానికి సిద్ధం అయ్యాడు.
టిటిడిలో అక్రమాలు నిరోధించడానికి వీలుగా ఒక్కొక్క విభాగం కంఫ్యూటరీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా డోనార్ సెల్‌లో దాతలకు ఇచ్చే లడ్డూ ప్రసాదాల పంపిణీకి బార్‌కోడ్ విధానం పెట్టారు. ఈ విధానం వల్ల వెంకటరమణకు అక్రమంగా లడ్డూలు పొందడానికి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో వెంకటరమణ ఎలాగైన అక్రమాలకు పాల్పడాలనే తపన పెరగడంతో కార్యాలయంలో అసహనంగా ప్రవర్తించేవాడు. ఇది గమనించిన డిప్యూటీ ఇఓ రాజేంద్ర అటెండర్ వెంకటరమణపై అనుమానం వచ్చింది. ఇదే విషయంపై అధికారులకు చెప్పారు. వారి అనుమానంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజి ఓ విమలాకుమారి అత్యంత గోప్యంగా మూడు నెలల పాటు వెంకటరమణ విధులకు వచ్చి తిరిగి వెళ్లే వరకు జరుగుతున్న పరివర్తనపై దృష్టి సారించడంతో విజిలెన్స్‌కు చిక్కాడు.