రాష్ట్రీయం

అన్యాయం జరిగిందని నిర్వాసితులు చెబితే..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: పులిచింతల నిర్వాసితులు కాంగ్రెస్ హయాంలో తమకు అన్యాయం జరిగిందని చెబితే తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పులిచింతల కింద రైతులకు 500 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామని, ఆదర్శ గ్రామాలను నిర్మించామని ఆయన సోమవారం సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేశామని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 180 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా మీనమీషాలు లెక్కిస్తున్నారని ఆయన విమర్శించారు. రైతులకు నష్టం కలిగించే విధంగా చేయవద్దని ఆయన కోరారు. ఇప్పటి వరకు ప్రభుత్వం మల్లన్న సాగర్ విషయంలో రైతులను బెదిరించే విధంగా మాట్లాడుతున్నదని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి లేదా మంత్రులు నిర్వాసితులతో సమావేశమై వారి ఆకాంక్షలేమిటో తెలుసుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల నుంచి భూములు లాక్కోవడానికి రెవెన్యూ అధికారులను ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. 2013 చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందించాలని, అలాగే ప్రజలు కోరుకున్న విధంగా వారికి అన్ని వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. భూముల మార్కెట్ విలువపై తాజాగా అంచనాలు వేయించాలని, ప్రాజెక్టులు నిర్మించే ముందు ఆ భూముల విలువ గురించి రైతులకు తెలియజేయాలని ఆయన సూచించారు. రైతుల అనుమతి లేకుండా వారిని మోసం చేసే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులకు అనుకూలంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్రం సోమవారం గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న టి.పిసిసినేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి. చిత్రంలో జానారెడ్డి,
షబ్బీర్‌అలీ, మల్లు భట్టి ఉన్నారు.